Bigg Boss 7 Telugu Weekend Episode : బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఆసక్తికరంగా సాగుతోంది. శనివారం ఎపిసోడ్ అయితే ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి. నాగార్జున హోస్ట్ గా చాలా బాగా వ్యవహారించారు. తప్పు చేసిన వారిని కరెక్ట్ చేయడం, బాగా ఆడినవారిని మెచ్చుకోవడం చేశారు. ఇప్పటికే సందీప్, శివాజీ పవర్ అస్త్రలు గెలుచుకుని హౌస్ మేట్స్ కన్ఫామ్ అయ్యారు. తాజాగా శోభాశెట్టి కూడా పవర్ అస్త్ర గెలుచుకోని ఫస్ట్ లేడీ హౌస్ మేట్ గా నిలిచింది. అయితే ఈ సందర్భంగా నాగ్.. గేమ్ ఛేంజర్ ఎవరు? సేఫ్ ప్లేయర్ ఎవరు? అని టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో గేమ్ చేంజర్‍గా యావర్ , సేఫ్ ప్లేయర్ గా టేస్టీ తేజా నిలిచారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నువ్వేమైనా పిస్తావా?
ఈ గేమ్ సందర్భంగా అమర్ దీప్, సందీప్, రతికలను నిలబెట్టి కడిగేశాడు నాగార్జున. ముందుగా సందీప్ కు గట్టిగానే క్లాస్ పీకాడు కింగ్. నువ్వేమైనా పిస్తావా అంటు ప్రశ్నించాడు. సంచాలకుడిగా ఫెయిల్ అయ్యావని మండిపడ్డారు. ప్రిన్స్ యావర్, ప్రియాంక, శోభా శెట్టిల్లో వీకెస్ట్ కంటెస్టెంట్ ను పక్కన పెట్టాలని బిగ్ బాస్ చెబితే.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ యావర్ ను అనర్హుడిగా ప్రకటించడం ఏంటని, ప్రియాంకకు సలహాలు ఇవ్వడం ఏంటని నిలదీశారు నాగ్. అయితే చికెన్ టాస్క్ విషయంలో సందీప్ నిర్ణయానికి ఓటేశారు. అయితే ఈ సందర్భంగా నాగార్జున సందీప్ బ్యాటరీ డౌన్ చేయించారు.


నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావ్!
ఇక అమర్ దీప్ ను అయితే ఓ రేంజ్ లో వేసుకున్నాడు నాగార్జున. నువ్వు  ప్రియాంకను గెలిపించేందుకు ఆడుతున్నావా లేదా నీ కోసం ఆడుతున్నావా అంటూ నేరుగా ప్రశ్నించారు నాగార్జున.  నువ్వు అనర్హుడు కాదని ప్రియాంక అంటే ఆమెను ఒక్క మాట అనవు.. అదే ప్రశాంత్ అంటే అతడిపై సీరియస్ అవుతావు.. ఇదెక్కడి న్యాయం అంటూ అమర్ ను ఏకిపారేశాడు కింగ్. ఈ ప్రశ్నలకు అమర్ వద్ద సమాధానం లేక  సైలెంట్ గా ఉండిపోయాడు.  అంతేకాకుండా విలన్, హీరో అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్పిన నువ్వు  శివాజీ పవర్ అస్త్ర దొంగతనం చేసి చివరకి జోకర్ అయ్యావని కామెంట్స్ చేశాడు నాగార్జున. మరోవైపు రతిక మీద కూడా ఫైర్ అయ్యారు కింగ్. అసలు హౌస్ లో ఉన్నావా అంటూ ప్రశ్నించారు. 


Also Read: Kushi on OTT: 'ఖుషి' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి