Kushi on OTT: 'ఖుషి' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Kushi Movie: విజయ్ దేవరకొండ- సమంత కాంబోలో వచ్చిన ఖుషి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2023, 11:48 AM IST
Kushi on OTT: 'ఖుషి' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Kushi Movie OTT Release Date: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్స్ లో నటించిన  ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టింది. లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో జయరాం, సచిన్ ఖేడకర్, మురళీశర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. 

సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. ఇందులో విజయ్, సామ్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. హేషమ్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్లస్ అయ్యాయి. తొలిరోజు రూ.30 కోట్ల వసూళ్లు సాధించి విజయ్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్ సాధించిన సినిమాగా ఖుషి నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.70 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత నుంచి ఈ సినిమా కలెక్షన్ల డ్రాప్ అయ్యాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.

ఈ మూవీ డిజటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. అక్టోబర్‌ 1 నుంచి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ రాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ స్వయంగా వెల్లడించింది. థియేటర్లలో రిలీజ్ అయిన సరిగ్గా నెల రోజులకు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంచనున్నారు. 

Also Read: 800 The Movie: 800 సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చీఫ్‌ గెస్ట్ గా ఆ స్టార్ క్రికెటర్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News