Another Bengali Model Commits Suicide: బెంగాలీ చిత్ర పరిశ్రమలో ఇటీవల ముగ్గురు నటీమణుల ఆత్మహత్యలు తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా సరస్వతీ దాస్ (18) అనే మరో యువ మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. కోల్‌కతాలోని కాస్బా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో సరస్వతీ దాస్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేవలం 15 రోజుల వ్యవధిలో ముగ్గురు నటీమణుల ఆత్మహత్య తర్వాత.. తాజాగా మరో మోడల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... సరస్వతీ దాస్ చిన్నతనం నుంచి అమ్మమ్మ ఇంట్లోనే ఉంటోంది. గత రాత్రి అమ్మమ్మతో కలిసి ఒకే గదిలో నిద్రించింది. అర్ధరాత్రి 2గం. సమయంలో సరస్వతీ దాస్ అమ్మమ్మకు మెలుకవ వచ్చింది. పక్కన సరస్వతీ దాస్ లేకపోవడంతో పక్క గదిలో చూసేందుకు వెళ్లింది. అక్కడ సరస్వతి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే సరస్వతిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 


పదో తరగతి వరకు మాత్రమే చదివిన సరస్వతీ దాస్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఆమె చాలా కష్టపడుతోంది. ఇదే క్రమంలో బాయ్‌ఫ్రెండ్‌తో గొడవలు ఆమెను మానసికంగా కుంగదీశాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి ఒంటిగంట వరకు ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. సరస్వతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


కొద్దిరోజుల క్రితమే బెంగాలీ నటీమణులు, మోడల్స్ బిదిషా మజుందార్, పల్లవి డే, మంజుషా నియోగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 15 రోజుల వ్యవధిలోనే ముగ్గురూ ఒకే తరహాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ముగ్గురూ తమ ఇళ్లల్లో ఉరేసుకుని బలవన్మరణం చెందారు. తాజాగా సరస్వతీ దాస్ కూడా తన ఇంట్లో ఉరేసకుని చనిపోయింది. ఈ వరుస ఆత్మహత్యలు బెంగాలీ సినీ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోందన్న ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. 


Also Read: Viral News: ఫోటోగ్రాఫర్ లేడనే కారణంతో పెళ్లినే రద్దు చేసుకున్న వధువు.. బిత్తరపోయిన వరుడు...


Also Read: Hyderabad Pubs: రాంగోపాల్ పేట్ సీఐ సస్పెండ్.. టకీలా పబ్ కేసులో హైదరాబాద్ సీపీ యాక్షన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook