Viral News: ఫోటోగ్రాఫర్ లేడనే కారణంతో పెళ్లినే రద్దు చేసుకున్న వధువు.. బిత్తరపోయిన వరుడు...

Latest Viral News: ఫోటోగ్రాఫర్ లేడనే కారణంతో ఓ వధువు పెళ్లినే రద్దు చేసుకుంది. పెళ్లికి ఫోటోలు కూడా తీయించలేని వరుడు ఇక తననేం చూసుకుంటాడని... అందుకే తనకీ పెళ్లి వద్దని తెగేసి చెప్పింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 10:43 AM IST
  • యూపీలో చిత్రమైన సంఘటన
  • ఫోటోగ్రాఫర్ లేకపోవడంతో పెళ్లి రద్దు చేసుకున్న వధువు
  • పెళ్లికి వధువు ససేమిరా అనడంతో పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ
  • పోలీసులు నచ్చజెప్పినా వినిపించుకోని వధువు
Viral News: ఫోటోగ్రాఫర్ లేడనే కారణంతో పెళ్లినే రద్దు చేసుకున్న వధువు.. బిత్తరపోయిన వరుడు...

Latest Viral News: ఈరోజుల్లో పురోహితుడు లేకపోయినా పెళ్లి జరుగుతుందేమో కానీ... ఫోటోగ్రాఫర్ లేకుండా పెళ్లి జరగదు. పెళ్లి తంతు మొదలైనప్పటి నుంచి ఇంట్లో చుట్టాల హడావుడి కన్నా ఫోటోగ్రాఫర్ హడావుడే ఎక్కువగా ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్, వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్‌ పేరిట వధూవరులు ఫోటోల మీద ఫోటోలు దిగేస్తుంటారు. పెళ్లిని అందమైన, మధురమైన జ్ఞాపకంగా మలుచుకునేందుకు ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలో ఫోటోషూట్స్‌కు ప్రాధాన్యత పెరిగిపోయింది. ఓవైపు వెడ్డింగ్ ఫోటోషూట్స్‌కి ఇంత ప్రాధాన్యముంటే... యూపీకి చెందిన ఓ వరుడు మాత్రం పెళ్లికి ఫోటోగ్రాఫర్ ఎందుకులే అని లైట్ తీసుకున్నాడు. కానీ అదే అతని కొంపముంచింది. పెళ్లికి ఫోటోగ్రాఫర్ లేడన్న విషయం తెలిసి వధువు పెళ్లికే నిరాకరించింది. 

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లాకు చెందిన ఓ యువతికి భోగ్నిపూర్‌కి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెద్దలు నిశ్చయించిన ప్రకారం ఇటీవల వీరి పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి రోజుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లికి ముందు నిర్వహించే వరమాల వేడుక కోసం వధూవరులు ఊరేగింపుగా మండపం వద్దకు చేరుకున్నారు. స్టేజీపై ఉన్న వధువు కళ్లు ఫోటోగ్రాఫర్ కోసం వెతకగా.. అతనెక్కడా కనిపించలేదు. తీరా తెలిసిందేంటంటే... అసలు పెళ్లికి ఫోటోగ్రాఫర్‌నే తీసుకురాలేదని. దీంతో ఆగ్రహించిన వధువు... తనకీ పెళ్లి వద్దంటూ స్టేజీ దిగి వెళ్లిపోయింది.

వధువు వెనకాలే ఇరువురి కుటుంబ సభ్యులు పరిగెత్తారు. ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ వధువు మాత్రం పెళ్లికి ససేమిరా అంది. పెళ్లిలో ఫోటోలు తీయించుకోవాలనే పట్టింపే లేనివాడు... ఇక తననేం చూసుకుంటాడని ప్రశ్నించింది. పెళ్లంటే అతనికి పెద్ద లెక్క లేదు కాబట్టే ఫోటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేయలేదని మండిపడింది. చివరకు ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరగా... అక్కడ కూడా వధువు పెళ్లి వద్దంటే వద్దని తెగేసి చెప్పింది. వధువు నిర్ణయంతో వరుడు బిత్తరపోయాడు. ఇక చేసేదేమీ లేక వరుడి తరుపువారు వధువు కుటుంబ సభ్యులు ఇచ్చిన కట్న, కానుకలు తిరిగిచ్చేసి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు.

కొద్దిరోజుల క్రితం ఇదే యూపీలో పెళ్లి మండపానికి వరుడు తాగొచ్చాడని ఓ వధువు అతన్ని చెడమడా వాయించేసి స్టేజీ దిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకు... వరుడికి బట్టతల ఉందన్న కారణంతో వధువు పెళ్లికి నిరాకరించిన ఘటన కూడా యూపీలోనే చోటు చేసుకుంది. తాజాగా ఇదే యూపీలో ఫోటోగ్రాఫర్ లేడనే కారణంతో వధువు పెళ్లికి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. 

Also Read: Bald Groom: 'బట్టతల' ఎంత పనిచేసింది.. కొద్ది నిమిషాల్లో పెళ్లనగా బయటపడ్డ సీక్రెట్... పెటాకులైన పెళ్లి...

Also Read: Malla Reedy On Revanth Reddy: రేవంత్ రెడ్డి గూండాలే నన్ను చంపాలని చూశారు.. మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News