Hema: నటి హేమ చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Bengaluru rave party case update: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచారు. ఈ క్రమంలో కోర్టు నటిహేమకు జూన్ 14 వరకు జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించింది.
Actress Hema rave party case update: బెంగళూరు రేవ్ పార్టీలో కేసులో సినిమాలకు మించిన ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నారు. ఈ ఘటన సినిమా ఇండస్ట్రీలో పెనుదుమారంగా మారింది. బెంగళూరు రేవ్ పార్టీ ఘటన మేనెల 20 న జరిగింది. ఈ పార్టీలో పాల్గొన్న వారు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో 103 మందికి బెంగళూరు పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా.. దాదాపు 86 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. వీరిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి నటి హేమ ఉండటం తీవ్ర కలకలంగా మారింది.
నటి హేమ కీ రోల్..
నటి హేమకు ఇప్పటికే బెంగళూరు పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీచేశారు. కానీ ఆమె ఒకసారి తనకు వైరల్ ఫీవర్ ఉందని,మరోసారి నోటీసులకు ప్రాపర్ గా రెస్పాండ్ కాలేదు. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు గత సోమవారం హైదరాబాద్ లోని నటి హేమ ఇంటికి చేరుకున్నారు. ఆమెకు మూడోసారి నోటీసులు జారీ చేసి అరెస్టు చేసి ప్రత్యేక వాహానంలో బెంగళూరు తరలించారు. హేమకు బెంగళూరు ఆస్పత్రిలో.. టెస్టులు చేశారు. ఆ సమయంలో ఆమె బుర్ఖా ధరించి ఉన్నారు. ఇదిలా ఉండగా.. నటి హేమ డ్రగ్స్ కేసులో కీరోల్ ప్లే చేసినట్లు తెలుస్తోంది.
జూన్ 14 వరకు రిమాండ్..
హేమను సీసీబీ పోలీసులు బెంగళూరు కోర్టులో హజరు పర్చాగా.. కోర్టు జూన్ 14 వరకు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. డ్రగ్స్ కేసులో నటి హేమది కీలకపాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలినట్లు సమచారం. హేమతో పాటు, మరో ఐదుగురిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆధారాల కోసం పోలీసులు పకట్భందిగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా రుజువైతే.. పనిష్మెంట్ కూడా అంతే సీరియస్ గా ఉంటుందని తెలుస్తోంది.
తప్పించుకొవడానికి హేమ టాక్టిక్స్..?
ఫస్ట్ నుంచి నటి హేమ చేసిన పనులు మాత్రం ఆమెపై అనుమానం రేకెత్తించేవిగా మారాయి. మొదట బెంగళూర్ పార్టీలో లేనని, తన ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని వీడియో రిలీజ్ చేశారు. దీంతో బెంగళూరు పోలీసులు ఆమెకు షాక్ ఇస్తు నటి హేమ ఫోటోను బైటపెట్టారు. అంతేకాకుండా.. హేమ బిర్యానీ వండి వీడియో తీయడంలాంటి పనుల వల్ల ఆమె ట్రోలింగ్ కు గురైంది.
Read more; Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..
మరోవైపు... ఆమె బ్లడ్ సాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నాయని, పలు మార్లు నోటీసులు ఇవ్వడం చేశారు. కానీ హేమ వీటికి ప్రాపర్ గా రెస్పాండ్ కాకపోవడం లాంటి పనులు తీవ్ర వివాదస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు రేవ్ పార్టీ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter