RRR Movie Promotion: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ అనూహ్యంగా వాయిదా పడటంతో పెద్ద నష్టాన్నే మూటగట్టుకుంది. విడుదలకు ముందే రాజమౌళి సినిమాకు నష్టం కలిగింది. ఆ వివరాలేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ నటులు రామ్‌చరణ్, ఎన్‌టి రామారావు హీరోలుగా బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందే నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావల్సి ఉంది. అయితే కోవిడ్ సంక్రమణ, ఒమిక్రాన్ వేరియంట్ దృష్టిలో ఉంచుకుని చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు, నైట్‌కర్ఫ్యూలు అమల్లో ఉండటంతో సినిమా విడుదలను వాయిదా వేయకతప్పలేదు. 


అయితే సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ (RRR Movie) దేశమంతా ప్రమోషన్స్ నిర్వహించింది. ముంబై, చెన్నై వంటి నగరాలతో పాటు బిగ్‌బాస్, కపిల్ శర్మ షోలలో ప్రమోషన్స్ నిర్వహించాయి. ప్రీ రిలీజ్ వేడుకుల్ని అత్యంత ఘనంగా నిర్వహించింది ఆర్ఆర్ఆర్ టీమ్. ముఖ్యంగా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా భారీగా అభిమానుల్ని వివిధ నగరాలకు తరలించి...అక్కడ స్టార్ హోటళ్లలో పెట్టించింది. ప్రీ రిలీజ్ వేడుకల్లో చప్పట్లు కొట్టేందుకు, ఛీర్స్, విజిల్స్ చేసేందుకు మీడియా మార్కెటింగ్ కోసం పెద్దఎత్తున ఖర్చు పెట్టాల్సి వచ్చింది.


ఇదంతా ఎందుకంటే సినిమాలో ముఖ్యపాత్రల్లో ఉన్న రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు (Jr Ntr) తెలుగు రాష్ట్రాలకు వెలుపల పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడమే. అభిమానుల్ని బయటకి తరలించేందుకు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలా మొత్తం సినిమా ప్రమోషన్ నిమిత్తం ఏకంగా 18-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా కోవిడ్ సంక్రమణ కారణంగా సినిమా వాయిదా పడటంతో భారీగా నష్టం మూటగట్టుకుంది ఆర్ఆర్ఆర్ యూనిట్.


సినిమా ప్రచారం నిమిత్తం ఇప్పటివరకూ ఖర్చు చేసిన 18-20 కోట్ల రూపాయలు (RRR Movie Promotions) పూర్తిగా వ్యర్ధమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా వాయిదా పడటంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు (Ramcharan) చాలా నిరాశకు లోనైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రచారం కూడా చాలా ఆర్భాటంగా సాగింది.


జనవరి 7న విడుదలకు అంతా సిద్ధమైపోయింది. కానీ అంతలోనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కరోనా కారణంగా సినిమా విడుదలను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల ఓసారి వాయిదా పడింది. వాస్తవానికి అక్టోబర్ 13 వతేదీ, 2021న విడుదల కావల్సిన సినిమా ఇది. అప్పుడు కూడా కోవిడ్ ఆంక్షల (Covid Restrictions) కారణంగానే వాయిదా పడింది. 


Also read: Naga Babu tweets on RGV : నేను అడగాల్సినవన్నీ నువ్వు అడిగావ్.. ఆర్జీవీపై నాగబాబు ట్వీట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి