Bigg Boss 14 contestant Sara Gurpal eye injury: బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్‌బాస్ 14 అక్టోబ‌ర్ 3న గ్రాండ్ లెవెల్లో ప్రారంభమైన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్‌లో 11 మంది కంటెస్టెంట్స్ రుబీనా దిలైక్‌, ఆమె భ‌ర్త అభిన‌వ్ శుక్లా, ఎజాజ్ ఖాన్‌, జాస్మిన్ బాసిన్‌, నిశాంత్ సింగ్ మ‌ల్కానీ, ప‌విత్ర పునియా, నిక్కీ తంబోలి, సారా గుర్పాల్‌, రాహుల్ వైద్య‌, హెహ‌జాద్ డియోల్‌, జాన్ కుమార్ సాను పాల్గొన్నారు. ఈ షోలో రాధే మా ( Radhe maa ) గెస్ట్‌గా వచ్చి కంటెస్టెంట్స్‌ని ఆశీర్వదించింది. Also read : Adipurush movie: ప్రభాస్ బర్త్ డే సర్‌ప్రైజ్ ఇదేనా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి వారంలో ఎలిమినేట్ అయిన పంజాబీ సింగర్, న‌టి సారా గుర్పాల్ ( BB 14 contestant Sara Gurpal ) ఎలిమినేష‌న్‌ను చాలామంది త‌ప్పు ప‌ట్టారు. కానీ ఆమెను ఎలిమినేట్ చేయడం వెన‌క ఆరోగ్య కార‌ణాలు కూడా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుకు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్న ఆమె ఫొటోలే నిద‌ర్శ‌నం. ఆమె క‌ళ్ల‌కు తీవ్ర గాయాలైన‌ట్లు ఈ ఫొటోల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. 


బిగ్ బాస్ హౌజ్‌లో గ‌త వారం జరిగిన ఇమ్యూనిటీ టాస్క్‌లో భాగంగా సారా బుల్డోజ‌ర్ ఎక్కి కూర్చుంది. ఆమెను తోసేసి కూర్చునేందుకు ప్రయత్నించిన నిక్కీ తంబోలి ( Bigg Boss 14 contestant Nikki Tamboli ).. తనకు తెలియకుండానే త‌న గోళ్ల‌తో సారా క‌ళ్ల ద‌గ్గ‌ర రక్కింది. ఈ ఫుటేజీని బిగ్‌బాస్ టీమ్ ఎడిటింగ్‌లో తీసేసింది. కానీ మిగ‌తా కంటెస్టెంట్స్ దీని గురించి మాట్లాడుకున్నట్టు టాక్ బయటకి రావడంతో ఇప్పుడు ఈ విషయంలో సారా అభిమానుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కళ్లకు గాయం అయిన కారణంగానే సారా ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని.. లేదంటే ఆమె కొనసాగేదే అని కొందరు చెబుతోంటే... ఆమెను తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకోవాలని ఇంకొందరు చెబుతున్నారు. ఎలిమినేట్ అయిన సారా ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటోంది. Also read : Jordar Sujatha about BB4 Telugu: అది నా తప్పు కాదు.. బిగ్ బాస్ నిర్ణయం: జోర్దార్ సుజాత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G