Bigg Boss 4 contestant Mehboob Shaik in Chiranjeevi film: బిగ్ బాస్ 4 కంటెస్టంట్స్ బిగ్ బాస్ తరువాత మంచి మంచి ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పటికే మోనల్ గజ్జర్ డాన్స్ ప్లస్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు నాగార్జున, చిరంజీవి కంటెస్టంట్స్‌కి వరాల జల్లు కురిపించారు. బిగ్ బాస్ 4 కంటెస్టంట్స్ తమ టాలెంట్‌తో అందరినీ అలరించారు. ప్రస్తుతం వాళ్ల టాలెంట్‌కి, కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది అని చెప్పొచ్చు. అలాంటి వాళ్లలో మెహబూబ్ దిల్ సే ఒకరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం సినీ పరిశ్రమలో వినిపిస్తున్న టాక్ ప్రకారం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో మెహబూబ్ ఒక చిన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి మాట్లాడుతూ.. మెహబూబ్ డాన్స్ స్టైల్‌ని చూస్తుంటే తనని తాను చూసుకుంటున్నట్టు ఉంది అని ప్రశంసించారు. అలాగే మెహబూబ్‌కి స్టేజ్ మీదనే 10 లక్షల చెక్కు రాసిచ్చారు చిరంజీవి ( Chiranjeevi). 


Also read : Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ సొహైల్‌కు ఘన స్వాగతం


ప్రస్తుతం ఆచార్య సినిమాలో మెహబూబ్ పాత్రని స్క్రిప్ట్‌లోకి చేర్చే పనిలో కొరటాల శివ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ గాసిప్ నిజమైతే ఇక మెహబూబ్ ( Bigg Boss 4 contestant Mehboob Shaik ) కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అంటున్నారు అతని అభిమానులు.


Also read : Bigg Boss 4 contestant Sohel: సోహెల్‌ టాలెంట్‌కి బ్రహ్మానందం ఫిదా.. సోహెల్ సినిమాకు తనవంతు సాయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook