Bigg Boss Sohel Cries: బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బుల్లితెర నటుడు సోహైల్. అప్పట్లో ఎంతో మంది ప్రేక్షకులు ఈయనని అభిమానించారు. ఆ తరువాత ఎన్నో చిన్న సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు. అయితే ఏ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఇక ప్రస్తుతం బూత్ కట్ బాలరాజు అనే సినిమా ద్వారా ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో.‌ ఈ  సినిమాతో నిర్మాతగా కూడా మారాడు సోహైల్. తన తండ్రి రిటైర్మెంట్ అయిన తరువాత వచ్చిన పెన్షన్ డబ్బులతో పాటు.. తన సంపాదన అంతా ఈ సినిమాపై పెట్టేశాడు. అయితే కష్టపడి సినిమా రిలీజ్ చేసిన తరువాత.. రివ్యూలు బాగా రాకపోవడంతో అలానే తన సినిమా చూడ్డానికి జనం థియేటర్‌కి రాకపోవడంతో కన్నీటి పర్యంతం అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని థియేటర్స్ లో ఈ సినిమాకి ప్రేక్షకులు లేకపోవడం వల్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి అయితే దీనిపైన స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు సోహైల్.. మీడియా ముందు మాట్లాడుతూ..‘కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరిస్తామని అంటారు కదా.. అసలు మీరు సినిమానే చూడకుండా కంటెంట్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది.. సినిమా చూస్తూ థియేటర్ నుంచే రివ్యూ రాస్తున్న ఓ ప్రబుద్ధుడి వీడియో చూడండి’ అంటూ ఒక వీడియోని చూపిస్తూ భోరున ఏడ్చాడు సోహైల్.


 



 
‘‘సినిమా అనేది ఫ్రెండ్స్‌తో మాత్రమే చూసేది కాదు.. ఫ్యామిలీస్‌తో కూడా చూడగలిగేది. అలాంటి సినిమానే మా ‘బూట్ కట్ బాలరాజు’. మా సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేదు. ప్లీజ్.. మీ అందరికీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. నా సినిమా రెండు రాష్ట్రాల్లోనూ చాలా చోట్లు థియేటర్స్‌లో వేశారు. కొన్నిచోట్ల మాత్రం షోస్ పడలేదు. చాలా బాధగా ఉంది. ఇక్కడ హైదరాబాద్‌లో రెస్పాన్స్ చాలా బాగుంది. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తాం అని అంటారు కదా.. మాది కంటెంట్ ఉన్న సినిమా. కనీసం ఓ ముప్పై.. నలభై మంది వెళ్లండి థియేటర్స్‌కి. చూస్తేనే కదా సినిమా ఎలా ఉందో తెలుస్తుంది. మేం ఇంకేం చేయాలి? సినిమా ఓ వైపు జరుగుతుంటే ఓ వ్యక్తి.. 20 నిమిషాలు సినిమా కంప్లీట్ కాకుండానే రివ్యూ టైప్ చేసేస్తున్నాడు ఫోన్‌లో. నేను రివ్యూవర్స్‌ని ఏమీ అనడంలేదు. కానీ అతన్ని నేను వీడియో తీశాను. సినిమా అవుతూనే ఉంది.. రివ్యూ రాసేస్తున్నాడు. 20 నిమిషాలు చూసి రివ్యూ రాసేస్తున్నారు” అని చెప్పకొవచ్చారు.


 


“మన సొసైటీలో మన బాధ చెప్పుకునే హక్కు ఉంది. మనిషి ఉన్నప్పుడు తన బాధ చెప్పుకున్నప్పుడు అర్ధం చేసుకోవాలే. దీన్ని కూడా దయచేసి నెగిటివ్ చేయొద్దు.  నా బాధను అర్ధం చేసుకోండి. ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా. నేను బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు సోహైల్.. సోహైల్ అని అన్నారు కదా.. కథ వేరే ఉంటాదని అన్నారు కదా.. మరి ఇప్పుడు ఏమైంది? మీకు దండం పెట్టి అడుగుతున్నా.. సినిమా చూడండి..  బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు వేల కామెంట్లు పెట్టారు కదా సోహైల్.. సోహైల్ అని.. అది ఇప్పుడేమైంది?’ అంటూ ఏడుస్తూనే మాట్లాడారు సోహైల్.


Also read:  TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!


Also read: Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook