బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) హౌస్ నుంచి 9వ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. మాస్టర్ హౌస్ నుంచి విడిచి వెళ్లడంతో ఆయనతో సన్నిహితంగా మెలిగే ఇతర కంటెస్టెంట్స్ సోహైల్, మెహబూబ్, అరియానా గ్లోరి (Ariyana) కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉదయం లేచి చూస్తే రేపటి నుంచి మాస్టర్ కనిపించరంటూ సోహైల్ ఏడ్చేశాడు. కెప్టెన్ కావాలి అని తొలివారం నుంచి అనుకున్నాడు ఆఖరికి కెప్టెన్ అయ్యాక మధ్యలోనే వెళ్లిపోయారు, వారం కెప్టెన్సీ చేయలేదని బాధగా మెహబూబ్ అన్నాడు.



 


తనను బిగ్‌బాస్ తెలుగు 4 హౌస్ నుంచి పంపించేయాలని కంటెస్టెంట్ అరియానా బిగ్‌బాస్‌ను వేడుకుంది. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కావడంతో ఏకాకిని అయిపోయానంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. నా వల్ల కాదు బిగ్‌బాస్, నేను మీరు అనుకున్నంత స్ట్రాంగ్ కూడా కాదు అని చెప్పింది. అరియానా కెమెరాతో ఏదో చెబుతుంటే తోటి కంటెస్టెంట్ అవినాష్ వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు కాదు నువ్వు వెళ్లు అని అరియానా అనేసరికి అవినాష్ పక్కకు వెళ్లిపోయి అతడు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. 


Also Read : Bigg Boss Telugu 4 Contestants Remuneration: బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ టాప్ 10 రెమ్యునరేషన్ వివరాలు వైరల్


 


‘నన్ను ఎందుకు ఒంటరిని చేస్తున్నారు బిగ్‌బాస్. నిజంగా నాకు ఉండాలని లేదు. నేను మీరు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు. ఇంత మందిని నా జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేదు. మీరు ఇచ్చిన బోల్డ్ అనేది కూడా తిరిగి తీసుకోండి. స్పోర్టివ్ స్పిరిట్ అయిపోయింది. మీకు పుణ్యం వస్తుంది నన్ను ఇంటికి పంపించేయండి. ఇక్క ఉన్న వాళ్లు నాకు నచ్చడం లేదు. నాకు కావాల్సిన వాళ్లు బయట కొందరే ఉన్నారు. వాళ్లతో ఉండాలని ఉంది. సాధ్యమైనంత త్వరగా ఇంటికి పంపించి పుణ్యం కట్టుకోండి బిగ్‌బాస్’ అంటూ కన్నీటి పర్యంతమైంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe