బిగ్‌బాస్ తెలుగు విన్నర్ సన్నీ హీరోగా రత్నబాబు తెరకెక్కిస్తున్న సినిమా అన్‌స్టాపబుల్ మోషన్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా విడుదల కానున్న ఈ సినిమా పోస్టర్ విడుదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్‌స్టాపబుల్ మోషన్ సినిమాలో వీజే సన్నీతో పాటు మరో హీరోగా సప్తగిరి నటిస్తున్నాడు. ఇక నక్షత్ర, అక్సాఖాన్‌లు కథానాయికలుగా కన్పించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా థియేటర్ రిలీజ్ కానుంది. అన్‌స్టాపబుల్ సినిమా డిజిటల్ హక్కుల కోసం వివిధ ఓటీటీ సంస్థల్నించి మంచి ఆఫర్లు లభిస్తున్నాయని చిత్ర నిర్మాత తెలిపారు. ఈ సినిమా క్యాప్షన్ అన్‌లిమిటెడ్ ఫన్‌కు తగ్గట్టుగానే టాలీవుడ్ కమెడియన్స్ అంతా కన్పిస్తున్నారు. 


ఇక పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకంతో పాటు పలు సినిమాలకు రచయితగా ఉన్న రత్నబాబు..బుర్రకథ, సన్నాఫ్ ఇండియా సినిమాలు రూపొందించారు. ప్రస్తుతం సన్నీ..దిల్‌రాజు నిర్మిస్తున్న ఏటీఎం అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు.


Also read: Avatar 2: అవతార్ 2 రన్‌టైమ్ ఎంతో తెలుసా, అంతసేపు ప్రేక్షకులు కూర్చుంటారా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook