Avatar 2: అవతార్ 2 రన్‌టైమ్ ఎంతో తెలుసా, అంతసేపు ప్రేక్షకులు కూర్చుంటారా

Avatar 2: ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న అవతార్ 2పై భారీ అంచనాలున్నాయి. మొదటి భాగంలానే సీక్వెల్ కూడా సంచలనం నమోదు చేయవచ్చనే అంచనా ఉంది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ ఇప్పుడు హాలీవుడ్‌లో ఓ సంచలనం కానుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 10, 2022, 10:39 PM IST
Avatar 2: అవతార్ 2 రన్‌టైమ్ ఎంతో తెలుసా, అంతసేపు ప్రేక్షకులు కూర్చుంటారా

ప్రపంచమంతటి దృష్టీ ఇప్పుడు త్వరలో విడుదల కానున్న అవతార్ 2పై ఉంది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి ఆసక్తి రేపుతున్న ఈ సినిమా రన్‌టైమ్ అందర్నీ నిర్ఘాంతపరుస్తోంది.

అవతార్ ది వే ఆఫ్ వాటర్‌గా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అవతార్ 2 సినిమాపై ప్రపంచంతటా భారీ అంచనాలున్నాయి. నీటిలో పండర గ్రహవాసులు చేసే విన్యాసాలు ఎలా ఉంటాయోనని ఆసక్తి కల్గిస్తోంది. ఇటు ఇండియాలో కూడా ఈ సినిమాపై అంచనాలు అధికంగానే ఉన్నాయి. మరో వారం రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈక్రమంలో ఈ సినిమాకు సంబంధించి వెలువడిన అప్‌డేట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అది ఈ సినిమా రన్‌టైమ్ సంగతి.

అవతార్ 2 సినిమా రన్‌టైమ్ ఏకంగా 192 నిమిషాల 10 సెకన్లు ఉందని తెలుస్తోంది. అంటే 3 గంటల 12 నిమిషాలు. 2009లో విడుదలైన అవతార్ మొదటి భాగం రన్‌టైమ్ 162 నిమిషాలే. అంటే 2 గంటల 42 నిమిషాలు. కానీ అవతార్ 2 మాత్రం ఏకంగా 3 గంటల 12 నిమిషాలుంది. ఇటీవలికాలంలో రెండున్నర గంటల నిడివి సినిమాలే రావడం లేదు. అలాంటిది అవతార్ 2 ఏకంగా 3 గంటల 12 నిమిషాలుండటం ఆశ్చర్యంగా ఉంది. అంతసేపు ప్రేక్షకులు థియేటర్‌లో కూర్చోగలరా అనేది ఆసక్తిగా ఉంది. 

Also read: Bigg Boss Telugu Season 6: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఈ వారం ఎలిమినేషన్ ఎవరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News