Brahmamudi March 16th Episode: ఈరోజు ఎపిసోడ్‌లో విడాకుల గురించి కావ్య మాట్లాడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ నాకుంది మీకు లేదు. మీరెప్పటికైనా మారతారనే నమ్మకం నాకు ఉండేది కానీ, ఇప్పుడు లేదు కాబట్టి విడిపోవడం తప్ప ఇప్పుడు మరో దారే లేదు అని రాజ్ చేతిలో విడాకుల కాగితాలు పెడుతుంది కావ్య. మీ నిర్ణయం ఏంటో నాకు సాయంత్రంలోపు చెప్పండి అంటుంది కావ్య. ఇక ఆ కాగితాలనే చూస్తూ ఉండిపోతాడు రాజ్. బ్యాగ్రౌండ్లో బ్రహ్మమూడి సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది.అప్పుడే రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది. శభాష్.. కట్టుకున్న భార్య మనసు విరగ్గొట్టావ్ సంతకం చేసేయ్ చూస్తావేంటి? సంతకం చేయ్, సంతకం చేయ్ నీకదే కదా ఆనందాన్నిచ్చేది అంటాడు. దీంతో రాజ్ ఆ పేపర్లను బెడ్ పై విసిరిగొడతాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కట్ చేస్తే హాల్లో అందరూ తింటూ ఉంటారు. కావ్య పైనుంచి దిగివస్తుంది. అమ్మమ్మ అప్పుడే కావ్య వద్దకు వెళ్లి ఇచ్చావా? అంటుంది. హుం.. అంటుంది కావ్య ఏమన్నాడు ఏమి అనలేదు నాకు భయంగా ఉంది అమ్మమ్మ అంటుంది. అదిగో వాడు దిగి వస్తున్నాడు రా.. రా.. మనం వెళ్లిపోదాం అని డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లి కూర్చుంటుంది ఇందిరా దేవి. అప్పుడే హేయ్.. రాజ్ డైనింగ్ టేబుల్ ఇక్కడ ఉంది రా.. టిఫిన్ చేద్దువు కానీ అంటుంది అపర్ణ. అప్పుడు వచ్చి కూర్చుంటాడు. రాజ్ కూడా వడ్డించు కావ్య అంటుంది అమ్మమ్మ. అలాగే అని వడ్డిస్తుంది కావ్య.. ఇంకా ఆలోచనలోనే ఉంటాడు రాజ్. ఏంట్రా అలా ఉన్నావ్ అంటుంది ఇందిరా దేవి.. అవును నానమ్మ అంటాడు. ట్యాబ్లెట్‌ ఇస్తాను వేసుకుందువులే అంటుంది. కొన్ని తలనొప్పులు సాయంత్రం వరకు తగ్గవు అంటుంది. అప్పుడే సుభాష్ కంపెనీలో శాలరీలు ఇవ్వాలి గుర్తుందా? అంటాడు. సాయంత్రంలోగా ఇస్తాడు అని వ్యతకారంగా అంటుంది ఇంద్రాణీ. ఇష్టం లేని ఇడ్లీ తినడం చూసి ఏమైంది ఇద్దరికీ అంటుంది ఇంద్రాణీ.  నీకన్ని డౌట్లే నువ్వు తిను అంటుంది ఇందిరాదేవి.


ఓ పక్క ఇందిరా దేవి, కావ్యలు మాట్లాడుతుంటారు. వారెమనుకుంటున్నాడో నాకు తెలియట్లేదు.. గదిలో మాట్లాడారు కదా అంటుంది ఇందిరా దేవి. నేను మాత్రమే మాట్లాడాను ఆయనేం మాట్లాడలేదు. అసలు నేను విడాకుల పేపర్లు ఇచ్చానా? అప్పడాల ప్యాకెట్ ఇచ్చానా? అంటుంది కావ్య. అయితే, నా మనవడు షాక్‌లో ఉన్నాడన్నమాట, నువ్వు ఇస్తావని ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు కదా.. అంటుంది ఇందిరా దేవి. నువ్వే అడిగావు కదా అని విడాకులు ఇస్తే అంటుంది కావ్య. శుభం పలక్కుండా అలా మాట్లాడతావు అంటుంది ఇందిరాదేవి.


ఇదీ చదవండి: ట్విస్ట్‌ అదిరిపోయింది.. రాజ్‌కు విడాకుల కాగితంపై సంతకం చేసిచ్చిన కావ్య.. 


ఇక ఆఫీసులో విడాకుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. అప్పుడే శ్వేత వస్తుంది. రాజ్, ఏంటీ ఫోన్ లిఫ్ట్‌ చేయడంలేదు. బయట పనుంది వస్తానని చెప్పావు. నువ్వు ఇంకా మీటింగ్లో ఉన్నావ్ అనుకున్నా ఫ్రీగానే ఉన్నావ్ కదా.. అని టేబుల్ పై ఉన్న విడాకుల పత్రాలను చూసి ఆశ్చర్యపోతుంది శ్వేత. ఇంతవరకు తెచ్చుకున్నావా? హింస అంటే శరీరానికి గాయం కావాలా? గుండెకు అయినా గాయమే కదా.. ఒక ఆడది కట్టుకున్న భార్యకు విడాకులు ఇస్తుందంటే ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిఉండాలి. పుట్టింటివాళ్లను , అత్తవారింటిని సమాజాన్ని కూడా జవాబు చెప్పాల్సి ఉంటుంది. వాటన్నింటిని తెలిసి కూడా విడాకులు అడిగింది అంటే కావ్య ఎంత బాధపడి ఉండొచ్చు. పెట్టు సంతకం పెట్టు. మౌనంగా ఉన్నావేంటి. ఇది కావ్య మీద ప్రేమ ఈ శూన్యాన్ని నువ్వు తట్టుకోలేవు పిచ్చివాడివైపోతావు. వెళ్లు నీ భార్య బయటకు వెళ్లకుండా నీ ప్రేమను అడ్డుపెట్టు అంటుంది శ్వేత.


ఇదీ చదవండి: 'సేవ్ ద టైగర్స్ 2' రివ్యూ.. సూపర్ హిట్ సీక్వెల్ మెప్పించిందా.. ?


కిచెన్లో ధాన్యలక్ష్మి, అనామికలు మాట్లాడుతుంటారు. అత్తయ్య మా కాలేజ్ ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్లు రిచ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు అంటుంది అనామిక. మీ ఆయన ఏం చేస్తాడు అంటే కంపెనీలు మొత్తం మా ఆయనే చూస్తాడు అని చెప్పాను. వాళ్లకు అసలు విషయం తెలిసిపోతుంది అత్తయ్య అంటుంది అనామిక. అప్పుడే హాల్లో కూర్చొని ఇందిరాదేవి, అపర్ణలు టీ తాగుతుంటారు. డోర్ శబ్దం అవుతుంది. డోర్ తీస్తుంది అనామిక మేం అనామిక ఫ్రెండ్స్ అంటుంది. లోపలికి రండి అని పిలుస్తుంది. సోఫాలో కుర్చుంటారు. వారు మాటల్లో పడతారు. పైనుంచి రుద్రాణీ గమినిస్తుంది. అపర్ణను తను ఎవరు అని అడిగితే తన గురించి పొగుడుతూ మాట్లాడుతుంది కావ్య.. ఇక రేపటి ఎపిసోడ్లో నేనుఒక నిర్ణయం తీసుకున్నా అది మీ అందరికీ ఇష్టం ఉన్నా లేకున్నా అమోదించాల్సిందే అని హుకూం జారీ చేస్తాడు కుటుంబ సభ్యులతో రాజ్.. చూడాలి మరి కావ్య రాజ్ లు విడిపోనున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook