Save The Tigers 2 OTT Review: 'సేవ్ ద టైగర్స్ 2' రివ్యూ.. సూపర్ హిట్ సీక్వెల్ మెప్పించిందా.. ?

Save The Tigers 2 OTT Review: 'సేవ్ ది టైగర్స్' గత కొన్నేళ్లుగా తెలుగులో ఎన్నో వెబ్ సిరీస్‌లు వచ్చాయి. కానీ ఫ్యామిలీ మొత్తం నవ్వించిన సిరీస్‌లో 'సేవ్ ది టైగర్స్' మూవీ ఒకటి. మరి దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'సేవ్ ది టైగర్స్ 2' వెబ్ సిరీస్ ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా మన రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 15, 2024, 09:28 AM IST
Save The Tigers 2 OTT Review: 'సేవ్ ద టైగర్స్ 2' రివ్యూ.. సూపర్ హిట్ సీక్వెల్ మెప్పించిందా.. ?

రివ్యూ.. 'సేవ్ ది టైగర్స్ 2'
నటీనటులు.. అభివన్ గోమఘం, ప్రియదర్శి, చైతన్యకృష్ణ, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి, సీరత్ కపూర్, దర్శనా బానిక్, వేణు ఎల్డండి..
దర్శకత్వం..అరుణ్ కొత్తపల్లి
నిర్మాత.. మహి వి రాఘవ్

Save The Tigers 2 OTT Review: 'సేవ్ ది టైగర్స్' గత కొన్నేళ్లుగా తెలుగులో ఎన్నో వెబ్ సిరీస్‌లు వచ్చాయి. కానీ ఫ్యామిలీ మొత్తం నవ్వించిన సిరీస్‌లో 'సేవ్ ది టైగర్స్' మూవీ ఒకటి. మరి దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'సేవ్ ది టైగర్స్ 2' వెబ్ సిరీస్ ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా మన రివ్యూలో చూద్దాం..

Save The Tigers 2 Web Series Review: ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభివన్ గోమఠం ముఖ్యపాత్రల్లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. మహి వి రాఘవ్ నిర్మాణ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. తాజాగా సిరీస్‌కు సీక్వెల్‌గా వచ్చిన 'సేవ్ ది టైగర్స్ 2' డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అరుణ్‌ కొత్తపల్లి డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. ఈ సీజన్ కూడా ఫస్ట్ సీజన్ ముగిసిన చోటు నుంచే ప్రారంభం అవుతోంది.

కథ విషయానికొస్తే..

హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్ ) కనిపించకుండా పోతుంది ? ఆమెను కిడ్నాప్ వెనకాల గంటా రవి (ప్రియదర్శి),. విక్రమ్ (చైతన్య  కృష్ణ) రాహుల్ (అభినవ్ గోమఠం) ఉన్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తారు. కనిపించకుండా పోయిన హంసలేఖను వీళ్లే మర్డర్ చేసారంటూ పలు న్యూస్ ఛానెల్స్ అనుమానం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది. హంసలేఖతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి..? హీరోయిన్ హంసలేఖ వ్యవహారంలో తమ భర్తలను వారి భార్యలు ఎలా అనుమానించారు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడు జంటల మధ్య గొడవలు జరగడానికి అసలు కారణం ఏమిటన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

కళ్లతో చూసేది ప్రతిదీ నిజం కాదు..'సేవ్ ది టైగర్స్ 2'అంతర్లీనంగా ఉంటుంది ఈ వెబ్ సిరీస్‌లో ఉన్న సందేశం. టీవీ ఛానెళ్లలో మనం రెగ్యులర్ చూసే వైరల్ న్యూస్.. దాంతో ప్రతిస్పందించే ప్రజలు.. దీంతో జరగే పరిణామాలను ఎంతో సెటైరికల్‌గా చూపించాడు దర్శకుడు అరుణ్‌ కొత్తపల్లి. అసలు సమాజంలో ఏం జరిగిందో తెలుసుకునే తీరిక, ఓపిక ఎవరికి ఉండటం లేదు. అసలు విషయం తెలుసుకోకుండా చేసే ప్రయత్నాల వల్ల కొన్ని జీవితాలు నాశనం అవుతుంటాయనే విషయాన్ని సూటిగా సుతి మెత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. మొత్తంగా మహి వి రాఘవ్ .. సేవ్ ది టైగర్స్ లో చేసిన మాయ సీక్వెల్‌లో కూడా రిపీట్ అయింది. మొత్తంగా మహి వి రాఘవలో రచనలో డ్రామా బాగుంది. ఒక మందు బిళ్లకు షుగర్ కోట్ వేసినట్టు ఈ సినిమా ఆద్యంతం నవ్వుతూనే మంచి సందేశం ఇచ్చారు. ఈయన గత సినిమా 'ఆనందో బ్రహ్మ' కూడా అదే విధంగా హ్యూమరస్‌గా సాగిపోతూ ఉంటుంది. మొత్తంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడు. మహి వి రాఘవ్ ఈ వెబ్ సిరీస్‌కు షో రన్నర్‌గా అద్భుతమైన బాధ్యతలు నిర్వర్తించారు.

మొత్తం ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా కుదిరాయి. మహి వి రాఘవ నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్ని సీన్స్ చూస్తుంటే.. సమాజంలో మోసపోయే వ్యక్తుల వార్తలను ఈ సినిమాలో కామెడీ కమ్ సందేశం కోసం ఏర్చి కూర్చి పెట్టినట్టు ఉంది.

నటీనటుల విషయానికొస్తే..
ఇందులో ప్రియదర్శితో పాటు అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణలు మరోసారి తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ఎక్కడా ఎక్కువ తక్కువ కాకుండా నటనతో పాటు కామెడీ కూడా పండించారు. జోర్డార్ సుజాత మరోసారి తన పాత్రలో రెచ్చిపోయింది. ఇక సత్యకృష్ణ, సీరత్ కపూర్ తన పరిధి మేరకు నటించారు. మొత్తంగా సేవ్ ది టైగర్స్ చూసిన వాళ్లకు ఈ సీక్వెల్ కూడా తప్పకుండా నచ్చుతుంది.

పంచ్ లైన్.. కామెడీ కమ్ ఎమోషనల్ డ్రామా.. 'సేవ్ ది టైగర్స్ 2'

రేటింగ్.. 3/5

Read More: Viral News: ఇజ్జత్ తీశావ్ కదారా నాయన.. ప్లేట్ పావ్ భాజీ కోసం దేన్ని చోరీచేశాడో తెలిస్తే షాక్ అవుతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News