Honeymoon Express Streaming On Amazon Prime: ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు రొమాంటిక్ కామెడీ మూవీ వచ్చేసింది. చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్స్‌గా నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్‌ప్రెస్. జూన్ 21న థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీకి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రేమ, పెళ్లి, విడాకులపై తెరకెక్కించిన ఈ సినిమాలో చైతన్య, హెబ్బా పటల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. సెటైరికల్‌గా సాగిపోయే కథలో కొన్ని ట్విస్టులు, సస్పెన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ మూవీ నేటి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బాల రాజశేఖరుని దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రాన్ని కేకేఆర్, బాల రాజ్ నిర్మించారు. కళ్యాణీ మాలిక్ అందించిన మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరామెన్‌గా వ్యవహరించారు. థియేటర్‌లో మెప్పించిన ఈ సినిమా.. ఓటీటీలోనూ అలరిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Fixed Deposit: ఈ స్కీములో 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 21 లక్షలు పక్కా.. బంపర్ ఆఫర్  


కథ ఏంటంటే..?


సోనాలి (హెబ్బా పటేల్), ఇషాన్ (చైతన్యరావు) ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే కాపురంతో కలతల కారణంగా ఓ రిలేషన్ షిప్ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్లకు దగ్గరకు వెళతారు. అయినా సఖ్యత కుదరకపోవడంతో విడాకులు తీసుకుందామని డిసైడ్ అవుతారు. ఈ క్రమంలో వీరద్దరికి పెద్దలుగా వ్యవహరించే బాల (తనికెళ్ల భరణి), త్రిపుర సుందరి (సుహాసిని) జంట సలహాతో ఈషాన్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే ఓ రిసార్ట్ వెళతారు. ఆ రిసార్ట్‌లోకి వెళ్లడంతో వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి..? సోనాలి, ఇషాన్ కలిశారా..? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. 


ఇటీవల యువ జంటలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం.. చిన్న చిన్న గొడవలకే విడిపోవడం చూస్తున్నాం. అయితే ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకోవాలని కాన్సెన్స్‌ను డైరెక్టర్ వివరించారు. అనవసరమైన గొడవలతో విడాకులు తీసుకుంటున్న జంటలకు ఈ సినిమా ఓ మెసేజ్. హెబ్బా పటేల్ అందాల ఆరబోత యూత్‌ను ఆకట్టుకుంటుంది. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ వంటి కాన్సెప్ట్‌తో థ్రిల్‌కు గురవుతారు. ప్రతి భార్య తన భర్త ఇలా ఉండాలని కోరుకోవడం.. ప్రతి భర్త తన భార్య ఇలాగే ఉండాలని కోరుకునే కాన్సెప్ట్‌ను చక్కగా తెరకెక్కించారు.


Also Read: Unified Pension Scheme: యూపీఎస్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ప్రయోజనాలు.. వారికి 19 శాతం పెంపు..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.