Fixed Deposit: ఈ స్కీములో 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 21 లక్షలు పక్కా.. బంపర్ ఆఫర్

Fixed Reposit Rate: సాధారణంగా చాలా మంది ఎఫ్డీలో ఒకటి లేదా రెండేండ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఎఫ్డీలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని మీకు తెలుసా. ప్రైవేట్ సెక్టార్ యాక్సెస్ బ్యాంక్, హెచ్డీఎస్సీ బ్యాంకు పదేండ్ల కాలం పాటు సుదీర్ఘ కాలవ్యవసధితో ఎఫ్డీ స్కీములపై సాధారణ కస్టమర్లకు 7శాతం వడ్డీ అందిస్తున్నాయి. ఈ స్కీములో రూ. 10లక్షలు ఇన్వెస్ట్ చేస్తే  రూ. 21లక్షలు మీ చేతికి వస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Written by - Bhoomi | Last Updated : Aug 27, 2024, 06:56 PM IST
 Fixed Deposit: ఈ స్కీములో 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 21 లక్షలు పక్కా.. బంపర్ ఆఫర్

FD Rates: మన సంపాదనలో కొంత భాగం కచ్చితంగా పొదుపు లేదా పెట్టుబడి రూపంలో దాచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో  రిటైర్మెంట్ అనంతరం మన జీవితం సాఫీగా గడవాలంటే,  ఇప్పటి నుంచే డబ్బులు పొదుపు చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ప్రారంభించినప్పటి నుంచి  రిటైర్మెంట్ వరకు ప్రతి ఉద్యోగి ప్రతినెల తన వేతనంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడము అలాగే మదుపు చేయడం కూడా తప్పనిసరి అని చెప్పవచ్చు. పొదుపు చేసేందుకు మన దేశంలో పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు అనేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములు, అలాగే పలు రకాల డిపాజిట్ స్కీములను అందుబాటులో ఉంచాయి. ఇక ఎవరైతే డబ్బును మదుపు చేయాలనుకున్నారో వారి కోసం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బాండ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఫైనాన్షియల్ అడ్వైజర్లు మాత్రం మీ భవిష్యత్తు కోసం వివిధ మార్గాల్లో డబ్బును  కేటాయించి పెట్టుబడి పెట్టాలని పొదుపు చేసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే మీ డబ్బు విలువ పెరిగి భవిష్యత్తులో మీరు కష్టాల బారిన పడకుండా కాపాడుతుంది.

మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్ డ్  డిపాజిట్లుగా చేసేందుకు ఇష్టపడుతుంటారు.  ఎందుకంటే వీటిపై స్థిరమైన ఆదాయం వస్తుంది. గ్యారంటీగా రాబడి లభిస్తుంది. బ్యాంక్ FDలో కస్టమర్  నిర్ణీత కాలానికి డబ్బును డిపాజిట్ చేయాలి. దానిపై వారు స్థిరమైన  హామీతో రాబడిని పొందుతారు. 

Also Read : Senior Citizen Saving Scheme: రిటైర్‎మెంట్ తర్వాత నెలకు రూ. 20 వేల పెన్షన్ కావాలా.. అయితే ఈ స్కీంలో చేరండి

10 సంవత్సరాల FD పై డబ్బు రెట్టింపు అవుతుందిలా:

సాధారణంగా FDలలో 1 లేదా 2 సంవత్సరాలు పెట్టుబడి పెడతారు. అయితే ఎఫ్‌డీలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ప్రైవేట్ సెక్టార్ యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 10 సంవత్సరాల సుదీర్ఘ కాలవ్యవధితో ఎఫ్‌డి పథకాలపై సాధారణ కస్టమర్లకు 7 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఈ వ్యవధిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు 10 సంవత్సరాల కాలానికి ఈ వడ్డీ రేటుతో మీకు కావలసినంత డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు, మెచ్యూరిటీకి మీరు రెట్టింపు కంటే ఎక్కువ డబ్బు పొందుతారు.

యాక్సిస్ బ్యాంక్‌లో FD చేయడం ద్వారా మీరు మెచ్యూరిటీకి ఎంత డబ్బు పొందుతారు?

మీరు యాక్సిస్ బ్యాంక్‌లో 10 సంవత్సరాల పాటు రూ. 10,00,000 FD చేస్తే, మీరు మెచ్యూరిటీపై రూ. 20,01,597 పొందుతారు. యాక్సిస్ బ్యాంక్ 10 సంవత్సరాల కాలవ్యవధితో FD స్కీమ్‌పై సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం వడ్డీని ఇస్తోంది. ఈ టెన్యూర్ ఎఫ్‌డి పథకంలో సీనియర్ సిటిజన్ రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీపై రూ.21,54,563 పొందుతారు.

Also Read : EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే ఈపీఎఫ్  మంత్లీ పెన్షన్ రూ. 10వేలకు వరకు లభించే ఛాన్స్   

HDFC బ్యాంక్‌లో FD చేస్తే మెచ్యూరిటీలో మీకు ఎంత డబ్బు వస్తుంది?

అదేవిధంగా, మీరు HDFC బ్యాంక్‌లో 10 సంవత్సరాల పాటు రూ. 10,00,000 FD చేస్తే, మీరు మెచ్యూరిటీపై రూ. 20,01,463 పొందుతారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 10 సంవత్సరాల కాలవ్యవధితో ఎఫ్‌డి స్కీమ్‌పై సీనియర్ సిటిజన్‌లకు 7.50 శాతం వడ్డీని ఇస్తోందని మీకు తెలియజేద్దాం. ఈ టెన్యూర్ ఎఫ్‌డి పథకంలో సీనియర్ సిటిజన్ రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీపై రూ.21,02,197 పొందుతారు. 

Disclaimer: పైన  తెలిపిన సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఇక్కడ తెలిపిన సమాచారం ఆర్థిక సలహాగా భావించరాదు. జీ తెలుగు న్యూస్ వెబ్ పోర్టల్ ఎలాంటి  ఆర్థిక సలహాలు ఇవ్వదు. మీ పెట్టుబడులు, ఆర్థిక నిర్ణయాలకు మా సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. ఆర్థిక సలహాల కోసం నిపుణుల సలహాలు సూచనలు పొందండి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News