New Movies: ఈ వారమే థియేటర్లలో గని.. ఓటీటీలో స్టాండప్ రాహుల్ విడుదల
New Movies: ఈ వారం తెలుగులో పెద్ద ఎత్తున కొత్త సినిమాలు విడుదలవనున్నాయి. గని, స్టాండప్ రహుల్ వంటి సినిమాలు ఈ వారమే సందడి చేయనున్నాయి. మరి థియేటర్లలో, ఓటీటీలో వచ్చే మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం.
New Movies: కొవడ్ తగ్గుముఖం పట్టిన తర్వత దేశంలో కొత్త సినిమాల జోరు కొనసాగుతోంది. వరుసగా కొత్త మూవీస్ రిలీజ్ అవుతూ.. సనీ ప్రియులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. వారం వారం సరికొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా ఈ వారం విడుదలవనున్న కొన్ని సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.
భారీ అంచనాలతో ఈ వారం విడుదలవుతున్న సినిమా 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథతో వస్తున్న ఈ మూవీలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్. ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 8న ఈ మూవీ థియేటర్లలో విడుదలవనుంది. ఇటీవల బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఆర్య హీరోగా వచ్చిన 'సార్పట్ట' ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్‌కు కావాల్సిన ఫైట్స్‌తో పాటు.. ఏమోషన్స్ వంటి ఎలిమెంట్స్ వంటివి ఉండటం ఈ సినిమాల ప్రత్యేకత. ఇప్పుడు అదే కోవలో వస్తున్న 'గని' మూవీ మూవీ ఎలా ఉండనుందో తెలియాలంటే.. 8వ తేదీ వరకు ఆగాల్సిందే.
'స్టాండప్ రాహుల్'
థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నప్పటికీ ఇంకా చాలా సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు మంచి రేటు దక్కుతుండటంతో నిర్మాతలు ఓటీటీలోనే నేరుగా సినిమాలు విడుదల చేస్తున్నారు. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ నటించిన 'స్టాండప్ రాహుల్' మూవీ నేరుగా ఆహా ఓటీటీలో విడుదలవనుంది. ఏప్రిల్ 8నే ఈ మూవీ కూడా విడుదల కానుంది. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించారు. కామెడీతో పాటు.. ఏమోషనల్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు కొత్త దర్శకుడు శాంటో మోహన వీరంకి. వెన్నెల కిశోర్, ఇంద్రజ, మురళీ శర్మ వంటి వారు ఈ మూవీలో నటించారు.
థియేటర్లలో 'మా ఇష్టం' (డేంజరస్)
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పిలుచుకునే రామ్ గోపాల్ వర్మ కొత్త ప్రయోగం.. మా ఇష్టం డేంజరస్ మూవీ ఈ నెల 8న థియేటర్లలో విడుదలవనుంది. అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కథ స్వలింగ (ఇద్దరు యువతుల మధ్య ప్రేమ) సంపర్కుల మధ్య జరిగి క్రైమ్, డ్రామాగా సాగనుంది. సక్సెస్‌తో సంబంధం కొత్త కొత్త ప్రయోజనాలు చేసే రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలను అందుకుంటారో లోదే వేచి చూడాలి.
వీటితో పాటు.. తెలుగులో పలు చిన్న సినిమాలు కూడా నేరుగా థియేటర్లలో విడుదల కానున్నాయి. డస్టర్, కథ కంచికి మనం ఇంటికి, రెడ్డిగారింట్లో రౌడీయిజం వంటి మూవీస్ థియేటర్లలో సందడి చేయనున్నాయి.
Also read: Rajamouli Dance: ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో నాటు నాటు సాంగ్ కు రాజమౌళి స్టెప్పులు!
Also read: Ricky Kej Grammy: గ్రామీ అవార్డు దక్కించుకున్న భారతీయ మ్యుజీషియన్.. ప్రధాని మోదీ అభినందనలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook