Chiranjeevi Birthday Special: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం సుస్థిరమైంది. పరిచయం అవసరం లేని పేరు. అభిమానులతో మెగాస్టార్ అని పిలిపించుకుంటున్న చిరు బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా ఆసలాయనకు మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చిందనేది తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో(Telugu Cinema Industry) ఏ విధమైన నేపధ్యం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 60 ఏళ్ల వయస్సులో సైతం అద్బుతంగా నటిస్తూ అభిమానుల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోతున్న చిరంజీవి పుట్టినరోజు(Chiranjeevi Birthday) ఇవాళ. అందుకే ప్రతియేటా ఆగస్టు 22 వచ్చిందంటే చాలు ఆయన అభిమానులకు పెద్ద పండుగే. మెగాస్టార్ అంటే చాలు చిరంజీవి. చిరంజీవి అంటే మెగాస్టార్. ఓ ప్రత్యేకమైన బిరుదుతో సుపరిచితుడయ్యారు. ముందు సహ నటుడిగా , తరువాత విలన్‌గా ఆ తరువా హీరోగా బ్లాక్ బస్టర్ మూవీలు అందిస్తూ స్వయంకృషితో ఎదిగిన మహా నటుడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.150కు పైగా చిత్రాల్లో నటించి సినీ పరిశ్రమకు విశేష సేవలందిస్తున్నారు. ఆయన బిరుదే ఓ బ్రాండ్‌గా మారిందంటే ఆయన స్థానం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఆయనకీ బిరుదు ఎలా వచ్చింది, ఎవరిచ్చారనేదే కదా ఆసలు ప్రశ్న. అదే ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు..అప్పట్లో చిరంజీవికి ఈ మెగాస్టార్(Megastar Title) అనే టైటిల్ ఇచ్చారు. కేఎస్ రామారావు, చిరంజీవి కాంబినేషన్‌లో నాలుగవ చిత్రం మరణమృదంగం. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తీసిన సినిమా ఓ బ్లాక్ బస్టర్. ఈ సినిమా టైటిల్స్ పడుతున్నప్పుడు చిరంజీవి(Chiranjeevi) పేరును యధాలాపంగా మెగాస్టార్ చిరంజీవి అని పెట్టారు నిర్మాత కేఎస్ రామరావు. తెరపై ఆ పేరు మెగాస్టార్ అని చూడగానే ధియేటర్ అంతా అభిమానుల చప్పట్లతో మార్మోగింది. అప్పట్నించి అలా కొనసాగుతూ ఇవాళ అదే ఓ బ్రాండ్‌గా నిలిచిపోయింది. 


Also read: Megastar Chiranjeevi: అభిమానులకు పిలుపునిచ్చిన చిరు, పుట్టినరోజున ఏం చేయాలంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook