Megastar Chiranjeevi: మెగాస్టార్ పుట్టినరోజంటే అభిమానులకు పండగే. అభిమాన నటుడు కాబట్టి అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈసారి తన పుట్టినరోజుకు ఏం చేయాలనేది పిలుపునిచ్చారు.
ఆగస్టు 22వ తేదీ..మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు(Chiranjeevi Birthday). అభిమాన నటుడు చిరంజీవి పుట్టినరోజును తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. రక్తదానం, అన్నదానం, కేక్ కటింగ్ ఇలా విభిన్నరకాలుగా జరుపుకుంటారు. అభిమానాన్ని ఘనంగా చాటుకుంటారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఎక్కడికక్కడే సేవాకార్యక్రమాలు చేయాలని చిరంజీవి అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి తన పుట్టినరోజు నాడు వినూత్నంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజున ప్రతి అభిమాని మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఆ విధంగా తనపై ప్రేమను చాటాలని కోరారు. అంతేకాకుండా హరా హైతో భరా హై అంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు సపోర్ట్ చేయమని కోరారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green india Challenge)కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టడంతో ఆయన చిరు ట్వీట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చిరు పిలుపుతో అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి భారీగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. సామాజిక స్పృహ దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల అభినందలు అందుకుంటోందన్నారు. ప్రకృతి మరింత ప్రేమాస్పదంగా మారేందుకు చిరు పిలుపు తోడ్పడుతోందని అభిప్రాయపడ్డారు. చిరంజీవి(Chiranjeevi) ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
Also read: Bheemlanayak: పవన్ కళ్యాన్ ఆన్ ఫైర్... విడులైన 'బ్రేక్ టైమ్ ఇన్ భీమ్లా నాయక్ స్టైల్'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook