Chiranjeevi with Gareth Wynn Owen : మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ ట్వీట్ వేశాడు. హైద్రాబాద్‌కు కొత్తగా వచ్చిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్‌ను డిన్నర్‌కు పిలిచాడట చిరంజీవి. ఈ క్రమంలో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు చిరంజీవి. అలానే అతను కూడా మెగాస్టార్‌తో కలిసి సంభాషణకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఈ డిన్నర్‌లో అతడిని మన తెలుగు సంప్రదాయ వంటకాలను రుచి చూపించాడు. తెలుగుకు ప్రతీకగా నిలిచే ఆవకాయ్‌ను కూడా పెట్టానంటూ చిరు తెలిపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ మేరకు చిరంజీవి వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. హైద్రాబాద్‌లోని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్‌ గారెత్ విన్ ఓవెన్‌ను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.. ఎన్నో అంశాల మీద మేం చర్చించుకున్నాం.. ఇండియా బ్రిటన్ సంబంధాలు, తెలుగు రాష్ట్రాల అభివృద్దిఇలా ఎన్నో విషయాల మీద మేం మా ఇంట్లో చర్చించుకున్నాం.. అంతే కాకుండా మన తెలుగు వంటకాలను ఆయనకు రుచిచూపించాం.. సర్రుమనే ఆవకాయ్‌ను మరిచిపోకుండా వడ్డించాం అని చిరంజీవి ట్వీట్ వేశాడు.


 



ఇక మరో వైపు ఆ డిప్యూటీ హై కమిషనర్ కూడా చిరు భేటీ మీద ట్వీట్ వేశాడు. చిరంజీవిని కలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది.. యూకే, టాలీవుడ్ ఇండస్ట్రీ, ఇండియా ఇలా అనే అనేక అంశాల మీద మేం చర్చించుకున్నాం.. ఇన్నేళ్లుగా ఆయన చేస్తూ ఉన్న సామాజిక సేవలు, కార్యక్రమాలను ప్రశసించాను.. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నాను.. ఇంకా ఇలాంటి ఎన్నో మీటింగ్స్‌లో ఇంకా ఎన్నో అంశాలను చర్చించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ వేశాడు.


చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉన్నాడు. దాని తరువాత భోళా శంకర్ చిత్రాన్ని పూర్తి చేస్తాడు. చివరగా చిరంజీవి గాడ్ ఫాదర్ అంటూ వచ్చాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేకపోయిందని తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్‌ మార్క్‌ని కూడా టచ్ చేయలేదని సమాచారం.


Also Read : Ram Charan Project : అటకెక్కిన RC 16.. గౌతమ్ తిన్ననూరికి నో చెప్పిన రామ్.. ఎస్ చెప్పిన విజయ్


Also Read : Unstoppable season 2 episode 3 Promo : పాతిక ముప్పై మంది హీరోయిన్లతో చేసి ఉంటారు కదా?.. బాలయ్యపై శర్వానంద్ నాటీ కామెంట్స్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook