Krishna Vamsi Rangamarthanda: క్రియేటివ్​ డైరెక్టర్​ కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' సినిమా (Rangamarthanda Movie) తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్​ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ఓ మెగా అప్​డేట్​ను డైరెక్టర్​ కృష్ణవంశీ ప్రకటించారు. 'రంగమార్తాండ' సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ (Chiranjeevi Voice Over For Rangamarthanda)​ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్​ ద్వారా వెల్లడిస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు దర్శకుడు కృష్ణవంశీ. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరాఠీలో ఘన విజయం సాధించిన 'నటసమ్రాట్' చిత్రానికి ఇది తెలుగు రీమేక్ (Natsamrat Remake In Telugu). అందులో నానా పటేకర్ చేసిన పాత్రను ఇక్కడ ప్రకాశ్ రాజ్ పోషిస్తున్నారు. ఆయనతో పాటు రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రలు (Rangamarthanda Movie Cast) పోషిస్తున్నారు. కృష్ణవంశీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్​లో విడుదలయ్యే (Rangamarthanda Movie Release Date) అవకాశం ఉంది.


'ఆచార్య' రిలీజ్​ డేట్​


మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' మూవీ రిలీజ్ డేట్​ను మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల (Acharya Movie Release Date) చేయనున్నట్లు తెలిపారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


Also Read: Nawab Malik On Sameer Wankhede: 'డబ్బు కోసం బాలీవుడ్​ యాక్టర్ల ఫోన్లు ట్యాప్​ చేస్తున్నారు' 


Also Read: RRR Movie Teaser Release Date: 'ఆర్ఆర్ఆర్' టీజర్​ రిలీజ్​కు ముహూర్తం ఖరారు?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.