Chiranjeevi Recieved Indian Film Personality of the Year 2022 Award: కొద్ది రోజుల క్రితం ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ప్రధానం చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ అవార్డుని మెగాస్టార్ చిరంజీవి గోవా ఫిలిం ఫెస్టివల్ లో అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ కొన్ని పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి సీని రంగంలో అడుగు పెట్టానని, నా తల్లిదండ్రులు శివశంకర్ ప్రసాద్ గా నాకు జన్మనిస్తే సినీ పరిశ్రమ మాత్రం చిరంజీవిగా జన్మనిచ్చిందని పేర్కొన్నారు. నాలుగున్నర దశాబ్దాల ప్రయాణంలో 10 ఏళ్లు సినిమాకు దూరంగా ఉన్నానని, అయినా నాపై ఇప్పటికీ అదే అభిమానం, ప్రేమ ప్రేక్షకులు చూపిస్తున్నారని అన్నారు. ప్రేక్షకుల హృదయాల్లో నా స్థానం పదిలం అని చెప్పిన ఆయన నాపై ప్రేమ గతంలో కంటే రెట్టింపు అయిందని అన్నారు.


అందుకే జీవితాంతం చిత్ర పరిశ్రమలో ఉంటానని తాను తెలుగు ప్రేక్షకుల ప్రేమకు దాసుడినని పేర్కొన్నారు. ఇక ఈ అవార్డు నన్ను గుర్తించి అందజేసిన ప్రధానమంత్రి మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొన్న ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమాలో విలువ ఏంటో తెలుసుకున్నానని ఏ రంగంలో అయినా అవినీతి ఉండవచ్చు కానీ సినీ పరిశ్రమలో అవినీతి లేదని మెగాస్టార్ పేర్కొన్నారు.  ఇక సినీ పరిశ్రమలో కేవలం ప్రతిభ ఒక్కటే కొలమానం అని ఆయన పేర్కొన్నారు.


ఇక నాకు ఇప్పటి యంగ్ హీరోలు పోటీ కాదన్న ఆయన నేనే వాళ్లకు పోటీ అంటూ కూడా కామెంట్ చేశారు.  వాళ్లకు ఇప్పుడు చాలా కష్టకాలమే అంటూ ఆయన చలోక్తులు విసిరారు. ఇక ఈ అవార్డు నాకే కాదు నా అభిమానుల్లోనూ ఎనలేని ఉత్సాహాన్ని నింపింది అని పేర్కొన్న ఆయన సరైన సమయంలో నాకు ఈ అవార్డు ఇచ్చారని భావిస్తున్నానని అన్నారు. ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నానని గతంలో జరిగిన చలన చిత్రోత్సవ వేడుకలకు ఒకసారే వచ్చానని గుర్తు చేసుకున్నారు.


దక్షిణాదికి చెందిన ఒక్క నటుడు ఫోటో కూడా లేదని అప్పుడు చాలా బాధపడ్డానని కానీ ఇప్పుడు అదే దక్షిణాది నటుడుకి ఈ అవార్డు రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానని అన్నారు.  ఇక సినిమా ఎక్కడైనా తీయచ్చు కానీ అది భారతీయ సినిమా అని గుర్తు పెట్టుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమాని రోజు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.


Also Read: Chakradhar Passed Away: మరచిపోలేని రోజే చిరంజీవి కూడా గౌరవించే అభిమాని మృతి!


Also Read: Meena Second Marriage: ఆ అంకుల్ తో మీనా రెండో పెళ్లంటూ ప్రచారం.. నిజం చెప్పేసిన సన్నిహితులు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook