Chakradhar Passed Away: మరచిపోలేని రోజే చిరంజీవి కూడా గౌరవించే అభిమాని మృతి!

Chiranjeevi Ardent Fan Chakradhar Passed Away: .చిరంజీవి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేకమందికి సేవలు అందించిన చక్రధర్ క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు. ఆ వివరాలు ​    

Last Updated : Nov 28, 2022, 08:45 PM IST
Chakradhar Passed Away: మరచిపోలేని రోజే చిరంజీవి కూడా గౌరవించే అభిమాని మృతి!

Megastar Chiranjeevi Ardent Fan Chakradhar Dondapati Passed Away: మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని చక్రధర్ కన్నుమూశాడు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా పేరు తెచ్చుకున్న చక్రధర్ తన అభిమాన హీరో బాటలోనే సమాజ సేవకు దిగి ఎంతోమందికి సేవ చేశాడు .చిరంజీవి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేకమందికి సేవలు అందించారు కృష్ణాజిల్లా పెడనకు చెందిన చక్రధర్. కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డాడు.

ఆ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదుకు పిలిపించి మెరుగైన వైద్యం అందించి అప్పటికప్పుడు ప్రాణాలు కూడా నిలబెట్టారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన దొండపాటి చక్రధర్ చిన్ననాటి నుంచి చిరంజీవికి ఆకర్షితుడయ్యాడు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు తాను కూడా చేయాలని భావించి అనేక వందల మందికి సేవ చేస్తూ వెళ్లారు. మెగా అభిమానుల తరఫున ఆపదలో ఉన్న వారందరినీ ఆదుకుంటూ అండగా నిలుస్తూ వచ్చారు.

అయితే ఆయన అనూహ్యంగా క్యాన్సర్ బారిన పది ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్నారు. ఇటీవల ఆగస్టు నెలలో ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి చక్రధర్ ను హైదరాబాద్ పిలిపించి ఒమేగా హాస్పిటల్ లో జాయిన్ చేయించి తాను కూడా హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. అంతేకాక హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం కూడా అందించాలని కోరారు, చక్రధర్ కు అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకి కూడా అప్పట్లో చిరంజీవి భరోసా ఇచ్చారు.

ఇక అలాంటి అభిమాని అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఒకరకంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది అభిమానులు ఉండి ఉండవచ్చు కానీ ఆయన కూడా ఎంతో అభిమానం చూపించే అభిమానులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఈ చక్రధర్ కూడా ఒకరు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నామని చెప్పుకుంటే వారికి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడమే కాదు వారు నిలదొక్కుకునే విధంగా కిరాణా షాపు చిన్న చిన్న హోటల్స్ కుదిరితే ఉద్యోగం లేదంటే ఏదో ఒక వ్యాపారం పెట్టించడానికి అండగా నిలబడేవారు.

అలా చిరంజీవి హెల్పింగ్ హాండ్స్ పేరు మీద ఉన్న ఎన్జీవోలో ఇతర హీరోల అభిమానులు సైతం సభ్యత్వం తీసుకునేలా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ వెళ్లారు. అయితే ఆయన క్యాన్సర్ తీవ్ర రూపం దాల్చడం వల్ల ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆయన వయసు 31 సంవత్సరాలు మాత్రమే. దురదృష్టమో, యాదృచ్ఛికమో తెలియదు కానీ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకునేందుకు చిరంజీవి గోవా వెళ్ళిన సమయంలోనే చక్రధర్ కన్నుమూయడం, మెగా అభిమానులందరికీ మరింత బాధిస్తోంది. 

Also Read: Meena Second Marriage: ఆ అంకుల్ తో మీనా రెండో పెళ్లంటూ ప్రచారం.. నిజం చెప్పేసిన సన్నిహితులు!

Also Read: Bigg Boss Nominations : ఆ ఇద్దరికి ఢోకా లేదు.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News