Fact Behind Actress Meena Second Marriage: ఒకప్పటి హీరోయిన్, ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆయన అనారోగ్యం తీవ్రంగా చెడిపోయినట్లు అప్పట్లో పేర్కొన్నారు. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ తో ఆయన చనిపోయినట్లుగా అప్పట్లో ప్రకటించారు. ఇక భర్త మృతి చెందిన విషాదంలో తీవ్రంగా కూరుకపోయిన మీనా ఇప్పుడిప్పుడే మళ్లీ ఈ లోకంలోకి వస్తున్నారు. ఆమెను మళ్లీ మామూలు మనిషిని చేసేందుకు ఆమె సహ నటీమణులు ఇతర హీరోయిన్లు కూడా చాలా ప్రయత్నాలు చేశారు.
దీంతో ఎట్టకేలకు ఆమె కాస్త కోలుకోవడంతో ఇప్పుడిప్పుడే మళ్ళీ షూటింగ్స్ కి కూడా హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇలాంటి తరుణంలో ఆమె రెండో పెళ్లికి సిద్ధమయ్యారు అనే వార్త టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మీనా వయసు 46 ఏళ్లు కావడంతో పాటు ఆమెకు ఒక చిన్నారి కూడా ఉండడంతో ఆమె ఒక్కతే ఇబ్బంది పడడం కంటే మరో వ్యక్తిని వివాహం చేసుకోవడం మంచిదని ఆమె తల్లిదండ్రులు బలవంతం చేసి ఆమెతో వివాహానికి ఒప్పించారనే ప్రచారం అయితే తెర మీదకు వచ్చింది.
చిన్నారి భవిష్యత్తు బాగుండాలన్నా, నువ్వు కాస్త వయసు పడ్డాక ఇబ్బంది పడకుండా ఉండాలన్నా మరొకరి తోడు ఉంటేనే బాగుంటుందని ఆమె తల్లిదండ్రులు మీనాను ఒప్పించారని తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద ఆమె వివాహం చేసుకునేందుకు సిద్ధమైందని ప్రచారం మొదలైంది. దానికి తగ్గట్లుగానే ఆమె కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తిని ఆమె వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారని అతను మీనా ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్ అని విద్యాసాగర్ కి కూడా అతను బాగా దగ్గర వాడని ప్రచారం మొదలైంది.
చాలా కాలంగా మీనా కుటుంబంతో అనుబంధం ఉండటమే కాక విద్యాసాగర్ తో కూడా మంచి అనుబంధం ఉండడంతో మీనాను ఆ వివాహం చేసుకునేందుకు అతను కూడా ఒప్పుకున్నాడని ఈ ప్రచారం సారాంశం. అయితే ఇదంతా వట్టి పుకార్లేనని మీనా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
ప్రస్తుతానికి మీనా ఎలాంటి పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేదని ఆమె తల్లిదండ్రులు కూడా ఈ మేరకు నిర్ణయాలు అయితే తీసుకోలేదని ఆమె తన కుమార్తెను బాగా చూసుకునే పనిలో బిజీగా ఉన్నారని అంతేగాని మరో వివాహం చేసుకునేందుకు అయితే ఆమె ఏమి సిద్ధం కాలేదని వారు వెల్లడిస్తున్నారు. ఒకవేళ అలాంటిదే ఏమైనా ఉంటే కనుక మీనా స్వయంగా ప్రకటిస్తారు తప్ప ఇలా అర్ధం పర్ధం లేకుండా సోషల్ మీడియాలో వార్తలు రాయడం సరికాదని అంటున్నారు.
Also Read: Prabhas Kriti Sanon Marriage : కృతి సనన్‌తో త్వరలోనే పెళ్లి.. ప్రభాసే ముందు ప్రపోజ్ చేశాడట!
Also Read: Adipurush VFX scene : 500 కోట్లు వేస్ట్ అనిపించిన యూట్యూబర్.. పాపం ఓం రౌత్ ను ఆడుకుంటున్నారుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook