Chiranjeevi: మేనల్లుడి సినిమాపై చిరంజీవి ఎందుకలా అన్నారు ?
లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమ పూర్తిగా మూతపడి..ఇటీవలే తిరిగి షూటింగ్‌లు జరుపుకుంటోంది. సుదీర్ఘ విరామం అనంతరం ఆ సినిమా విడుదలతో బాక్సాఫీసు సందడి కన్పించనుంది. మరి చిరంజీవి ఆ సినిమా గురించి అలా ఎందుకన్నారు..
లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమ పూర్తిగా మూతపడి..ఇటీవలే తిరిగి షూటింగ్‌లు జరుపుకుంటోంది. సుదీర్ఘ విరామం అనంతరం ఆ సినిమా విడుదలతో బాక్సాఫీసు సందడి కన్పించనుంది. మరి చిరంజీవి ఆ సినిమా గురించి అలా ఎందుకన్నారు..
కరోనా వైరస్ ( Corona virus ) నేపధ్యంలో దేశమంతా స్థంబించినట్టే సినీ పరిశ్రమ కూడా ఆగిపోయింది. అన్‌లాక్ ( Unlock ) ప్రక్రియలో భాగంగా ఇటీవల మళ్లీ సందడి మొదలైంది. షూటింగ్ ( Shootings ) లు ప్రారంభమయ్యాయి. థియేటర్లు కూడా ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ కాలం విరామం అనంతరం విడుదలయ్యే తొలి సినిమా ( First movie after lockdown )పై అందరి దృష్టీ ఉండటం సహజమే. ఆ తొలి సినిమా ఏంటో తెలుసా..
చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam tej ) నటింటిన సోలో బ్రతుకే సో బెటర్ ( Solo Brathuke so better ) సినిమా ఇది. క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై పరిశ్రమలో ఎక్కువ అంచనాలున్నాయి. లాక్‌డౌన్ అనంతరం విడుదలవుతున్న తొలి సినిమా కావడంతో అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. మీడియం బడ్జెట్ సినిమాగా విడుదల కానున్న ఈ సినిమా రెస్పాన్స్‌ను బట్టి..మిగిలిన నిర్మాతలు వారి సినిమాల రిలీజింగ్ డేట్స్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే అందరి దృష్టి సాయి ధరమ్ తేజ్ సినిమాపై పడింది.
అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే..మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) తన మేనల్లుడి సినిమాపై ఆ విధమైన వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్ అనంతరం విడుదలవుతున్న తొలి సినిమా అవడంతో ఇండస్ట్రీకు చాలా ముఖ్యమని చిరు అన్నారు. ఈ సినిమాకు లభించే ఆదరణతో చిత్ర పరిశ్రమకు ఓ స్ఫూర్తి లభిస్తుందన్నారు. ప్రేక్షకులంతా బాధ్యతతో మాస్క్‌లు ధరించి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయాలని సూచించారు.
Also read: Samantha Akkineni: సమంత సామ్ జామ్ షోకు నాగచైతన్య, అఖిల్