Vishwak Sen remuneration: షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరియర్ ను మొదలుపెట్టి.. ఇప్పుడు హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తెలుగు అమ్మాయి చాందిని చౌదరి. ఒకవైపు కమర్షియల్ సినిమాలలో తో అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే.. మరొకవైపు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా ముందుకు దూసుకు వెళ్తోంది. ఈ మధ్యనే గామి సినిమాలో హీరోయిన్ గా కనిపించిన చాందిని చౌదరి.. తాజాగా ఇప్పుడు యేవమ్ అనే ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో కనిపించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో చాందిని చౌదరి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. తనకి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చిపెట్టిన కలర్ ఫొటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్ కూడా హాజరయ్యారు. అంతేకాకుండా చాందిని చౌదరితో.. గామి సినిమాలో నటించిన హీరో విశ్వక్ సేన్ కూడా ఈ ఈవెంట్ లో కనిపించారు. 


అయితే సందీప్ రాజ్ అందించిన ముఖచిత్రం.. అనే సినిమాలో విశ్వక్ సేన్ క్యామియో పాత్రలో కనిపించారు. వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమని, చైతన్య రావు ప్రధాన పాత్రలలో కనిపించిన ముఖచిత్రం సినిమా.. క్లైమాక్స్ లో.. విశ్వక్ సేన్ క్యామియో పాత్రలో కనిపిస్తారు. అయితే యేవమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. డైరెక్టర్ సందీప్ క్రాస్ విశ్వక్ సేన్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. 


"ఈ మనిషి గురించి నేను మీకు చెప్పాలి. విశ్వక్ సేన్ గారు..మేము ఇద్దరం ముఖచిత్రం అనే సినిమాకి కలిసి చేశాము. ఆ సినిమాకి నాకు డబ్బులు ఎగ్గొట్టారు. అంటే నేను ఇవ్వాల్సిన వాడిని కానీ.. ఆయన తీసుకోకుండా ఎగొట్టారు. ఎవరైనా ఒక చిన్న సినిమా.. నాకు హెల్ప్ కావాలి.. క్యామియో పాత్ర చేసి పెట్టాలి.. చిన్న మంచి క్యారెక్టర్ ఉంది.. ఇలా ఏం చెప్పినా కూడా విశ్వక్ సపోర్ట్ చేస్తారు" అని అన్నారు సందీప్ రాజ్. 


ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయ్యి ఉండి కూడా.. విశ్వక్ సేన్ చిన్న సినిమాల కోసం చేసే సహాయం నిజంగా గొప్పదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సినిమాల పరంగా చూస్తే విశ్వక్ సేన్ గామి సినిమాతో మంచి రివ్యూస్ అందుకున్నారు. ఈ మధ్యనే విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. కూడా విడుదలై మంచి రివ్యూస్ అందుకుంది. 


ఇక యేవమ్ గురించి చెప్పాలంటే.. చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వశిష్ట సింహ, భరత్ రాజ్, అషు రెడ్డిలు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రకాష్ దంతులూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నవదీప్ సీ స్పేస్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.


Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter