Balagam Ott Release Date: సుమారు 20 రోజుల క్రితం విడుదలైన బలగం సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మితమైన ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ లో రూపొంది మంచి హిట్ అయింది. నిజానికి ఈ సినిమా మార్చి మూడో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమాలో తెలంగాణ నేపథ్యంలో పలు ఆసక్తికర సన్నివేశాలు తెరపై ఆవిష్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఈ సినిమా కేవలం నైజాం ప్రాంతంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో కూడా సంచలన కలెక్షన్స్ దక్కించుకుంటూ ముందుకు వెళుతుంది. కేవలం కోటిన్నర బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ల మార్కెట్లో దిగిన ఈ సినిమా దాదాపుగా ఇప్పటిదాకా 10 కోట్ల దాకా షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ పూర్తయిన తర్వాత 8:30 కోట్ల దాకా లాభాల బాటలో పయనిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉగాది సందర్భంగా రెండు తెలుగు సినిమాలు విడుదలైనా సరే బలగం కలెక్షన్స్ లో మాత్రం ఏ మాత్రం జోరు తగ్గలేదు.


కోటిన్నర కలెక్ట్ చేసి సత్తా చాటింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో(Balagam on Amazon Prime Video) వేదికగా ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవలం ఇండియా వరకే పరిమితం కాగా  విదేశాల్లో ఉన్నవారు చూసి ఎందుకు సింప్లీ సౌత్ అనే మరొక యాప్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.


మొత్తం మీద 20 రోజులు పాటు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాతో దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి నిర్మాతగా పరిచయమయ్యారు అంతకుముందే దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందిన ఏటీఎం అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయిమా మొదటి సినిమాగా మాత్రం బలగం రిలీజ్ అయింది.


Also Read: Rashmika Mandanna Photos: బ్లేజర్లో మెరిసిపోతున్న రష్మిక మందన్నా.. బటన్స్ విప్పేసి మరీ అందాల జాతర!


Also Read; Anushka Shetty Angry: ప్రభాస్ పై అనుష్క ఆగ్రహం.. ఆ విషయంలో హర్ట్ అవడంతో ఇక కలిసి నటించకూడదని నిర్ణయం?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook