Dear Nanna OTT:  డియర్ నాన్న మూవీ ఆహా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడ ఈ సినిమాను ప్రేక్షకులు మంచి రేటింగ్స్ ఇస్తున్నారు. కరోనా బ్యాక్ డ్రాప్ లో ఫాదర్ సన్ ఎమోషన్ ను ఎంతో  అద్భుతంగా చూపించిన విధానం ఈ సినిమా కథ, కథనం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది.
పెద్ద వంటవాడు (చెఫ్) కావాలని కలులు కనే చైతన్య రావ్ తన జీవితంలో ఎదురైన సంఘటనలు.. తనలో కలిగిన మార్పుని దర్శకుడు అంజి సలాది ఆలోచన రేకెత్తించే విధంగా ఎంతో ఎఫెక్టివ్ గా తెరపై చూపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తండ్రి కొడుకులుగా నటించిన చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు కదిలిస్తాయి. మెడికల్ షాప్ తనకి బిజినెస్ కాదని చెప్పే సన్నివేశాలు ఆకట్టుకునేలా వున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో మెడికల్ షాప్ ల ప్రాధాన్యత, వారు చేసిన త్యాగాలు, చూపిన తెగువని డైరెక్టర్ ఎంతో ఎఫెక్టివ్ గా చూపించాడు.చైతన్య రావ్ నటన ఆకట్టుకునే విధంగా ఉంది. యష్ణ చౌదరి స్క్రీన్ పై నటన బాగుంది. సూర్య కుమార్ భగవాన్ దాస్ తో పాటు సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ నాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.
అనిత్ కుమార్ మాధాడి కెమరాపనితనం అట్రాక్టివ్ గా ఉంది. గిఫ్టన్ ఎలియాస్ నేపధ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది. మంచి ఎమోషన్స్, ఆకట్టుకునే కథ, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, మంచి నటనతో  వచ్చిన డియర్ నాన్న ఈ వీకెండ్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీగా స్ట్రీమ్ అవుతోంది.


Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter