Bollywood celebrities in drugs case : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ( Rhea Chakraborty ) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించడం మొదలుపెట్టిన తర్వాత ఈ కేసులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. డ్రగ్స్ కేసు ( Drugs ) బాలీవుడ్‌ని ఓ కుదుపు కుదిపేసే స్థాయిలో పలువురు సినీ ప్రముఖులు, టాప్ హీరోయిన్స్ పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగం ( NCB ) అధికారులు.. ఆ జాబితాలో ఉన్న వారిలో ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేసి తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరైన దీపికా పదుకునే ( Deepika Padukone ) సైతం సెప్టెంబర్ 26న ఎన్.సి.బి అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. Also read : Mumbai Drugs Case: తెరపైకి హీరో మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ పేరు?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NCB అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో దీపికా పదుకునే ప్రస్తుతం పలువురు న్యాయ నిపుణుల ( Legal experts ) నుంచి న్యాయపరమైన సలహాలు తీసుకునే పనిలో బిజీ అయ్యిందట. ఇప్పటికే డ్రగ్స్ గురించి దీపికా ఇతరులతో చాట్ చేసినట్టుగా ఉన్న పలు చాట్ సెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో డ్రగ్స్ కేసులో దీపికా పదుకునే సైతం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోకతప్పదనే టాక్ బలంగా వినిపిస్తోంది.


ముంబై డ్రగ్స్ కేసులో దీపికా పదుకునేతో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ( Shraddha Kapoor, Sara Ali Khan, Rakul preet Singh ) వంటి స్టార్ హీరోయిన్స్‌ పేర్లు వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ చిట్టా ఇంకా పెరగొచ్చు కానీ తగ్గే ఛాన్స్ కనిపించడం లేదని బాలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. Also read : Rhea Chakraborty: నటి రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు


ఇదే కేసులో టాలెంట్ మేనేజర్ జయ సాహాను ( Kwan probe ) విచారించినప్పుడు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ( Mahesh Babu's wife Namrata Shirodkar ) పేరును సైతం వెల్లడించినట్టు వార్తలొచ్చాయి. దీంతో నమ్రతా శిరోద్కర్ సైతం ఈ కేసు విచారణకు హాజరు కావాల్సి వస్తుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నమ్రతా శిరోద్కర్ ( Namrata Shirodkar ), డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించినప్పటి నుంచి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe