Rhea Chakraborty: నటి రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో పాటు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగించారు.

Last Updated : Sep 22, 2020, 02:41 PM IST
Rhea Chakraborty: నటి రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో పాటు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగించారు. ఈ మేరకు ఎన్‌డీపీఎస్ కోర్టు తీర్పు వెలువరించింది. మరోవైపు బెయిల్ కోసం బాంబే హైకోర్టును నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఆశ్రయించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) వీరిని మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ చేయడం తెలిసిందే. Mahesh Babu: నా అసలైన సంతోషం నువ్వే: నమ్రతా శిరోద్కర్ 

కాగా, జూన్ 14న ముంబైలోని బాంద్రాలో తన అపార్ట్‌మెంట్‌లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. రియా చక్రవర్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి పాట్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపై కేసు సీబీఐకి చేతికి వెళ్లింది. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), నార్కోటిక్స్ విభాగం సైతం రంగంలోకి దిగింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా పరిస్థితి మారింది.  

రియా చక్రవర్తి.. బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు సారా అలీ ఖాన్, మరో 15 మంది పేర్లను వెల్లడించినట్లు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ పేరు సైతం డ్రగ్స్ కేసులో బలంగా వినిపిస్తోంది. త్వరలో రకుల్‌ను సైతం నార్కోటిక్స్ విభాగం విచారించేందుకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. బాలీవుడ్ ప్రముఖుల పేర్లు రోజూ కొన్ని కొత్తపేర్లు తెరమీదకి వస్తున్నాయి. 3D Player Vijay Shankar: ఒక్క బంతికి 10 పరుగులు ఇచ్చిన విజయ్ శంకర్

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News