Court Notices to Prabhas: `ఆదిపురుష్`కు మరో షాక్.. ప్రభాస్ సహా సినిమా యూనిట్ కు లీగల్ నోటీసులు!
Delhi High Court Notices to Prabhas Along With Adipurush Unit: ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా యూనిట్లో ప్రభాస్ సహా దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ సహా సైఫ్ అలీ ఖాన్ వంటి వారికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు
Delhi High Court Notices to Prabhas Along With Adipurush Unit : ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమాకి కష్టాలు వీడడం లేదు. ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను ఓం రౌత్ దర్శకత్వంలో టీ సిరీస్ సంస్థ ఈ సినిమాను సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉండగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుని పాత్రలో దేవదత్త నాగే నటిస్తున్నారు.
నిజానికి ఈ సినిమా టీజర్ ను దసరా కానుకగా అక్టోబర్ 2వ తేదీన అయోధ్య సరయూ నది ఒడ్డున విడుదుల చేశారు. అయితే ఈ ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో యూజర్లు సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాను బహిష్కరించాలనే డిమాండ్ కూడా పలు రాజకీయ పార్టీల నేతల నుంచి వినిపిస్తోంది. అంతే కాదు ఈ సినిమాపై వివిధ నగరాల్లో కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి.
సినిమాలో రావణుడు, హనుమంతుడి లుక్‌ని తప్పుగా చూపించారని చాలా మంది ఘాటు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు కొంత మంది నెటిజన్లు అయితే రావణుడి రూపాన్ని అల్లాఉద్దీన్ ఖిల్జీతో పోలుస్తున్నారు. తాజాగా మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్, నటీనటులపై కేసు నమోదైంది. చిత్రనిర్మాత ఓం రౌత్, టి-సిరీస్ భూషణ్ కుమార్, కృతి సనన్, ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్‌లకు తాజాగా న్యాయవాది ఆశిష్ రాయ్ లీగల్ నోటీసు పంపారు.
సినిమా నిర్మాతలు, కళాకారులు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని నోటీసులో పేర్కొన్నారు. ఈ చిత్రంలో రామాయణంలోని పాత్రలను సైతం ఇస్లామీకరణ చేసి మరీ ప్రదర్శించారని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. లాయర్ ఆశిష్ రాయ్ మాట్లాడుతూ “ఆదిపురుష్ మేకర్స్, నటులు భారతీయ హిందూ నాగరికతను అపహాస్యం చేసిన విధానం తప్పని, సినిమా ప్రమోషన్‌ను వెంటనే నిలిపివేయాలని నేషనల్ సినీ వర్కర్స్ యూనియన్ లీగల్ నోటీసులు జారీ చేసిందని, ఈ తప్పులను సరిదిద్దుకోకపోతే నిర్మాతలు, కళాకారులపై తగిన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇక ఈ నోటీసులపై సినిమా యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఆదిపురుష్ సినిమా 2023 జనవరి 12న విడుదల కానుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా సినిమాలో రావణుడు, హనుమంతుడి పాత్రపై జనాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆది పురుష్ విఎఫ్‌ఎక్స్‌పై కూడా జనాలు ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Karan Johar Good Bye: ట్విట్టర్ కు కరణ్ జోహార్ గుడ్ బై.. అందుకే అంటూ క్లారిటీ!
Also Read: Nayanthara surrogacy: వివాదంలో నయనతార 'అమ్మతనం'.. అలా ఎలా అంటూ నోటీసులు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook