Drinker Sai Movie Review: ఇటీవల ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన మూవీ డ్రింకర్ సాయి. ట్రైలర్‌లో బూతు డైలాగ్స్‌తోపాటు ఎమోషన్ కూడా ఆడియన్స్‌లో అంచనాలు క్రియేట్ చేసింది. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించగా.. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, కిర్రాక్ సీత, రీతూ చౌదరి, అంబర్‌పేట్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ సంయుక్తంగా నిర్మించారు. అంచనాల నడుమ నేడు థియేటర్లలో సందడి మొదలు పెట్టిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ ఏంటంటే..


సాయి (ధర్మ) బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టినా.. తల్లిదండ్రులు చనిపోవడంతో మద్యానికి బానిసై స్నేహితులతో జులాయిగా తిరుగుతుంటాడు. గొడవలు పెట్టుకోవడం.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రావడం కామన్‌గా జరుగుతుంటుంది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న సాయిని వైద్య విద్యార్థి బాగీ (ఐశ్వర్య శర్మ) తన స్కూటీతో ఢీకొట్టి.. అక్కడి నుంచి పారిపోతుంది. తనకు యాక్సిడెంట్ చేసిన అమ్మాయి గురించి తెలుసుకున్న సాయి.. ఆమెతోనే ప్రేమలో పడతాడు. అయితే తనను ఏం చేస్తాడోనని భయంతో ప్రేమిస్తున్నట్లు బాగీ అబద్దం చెబుతుంది. బాగీ ప్రేమపై సాయికి అనుమానం ఉంటుంది. తనను ప్రేమించట్లేదని నిజం తెలుసుకున్న సాయి ఏం చేశాడు..? బాగీ ప్రేమను పొందాడా..? వీరిద్దరు ఒక్కటయ్యారా..? అనేది మిగిలిన స్టోరీ.


ఎవరు ఎలా నటించారు..?


సాయి పాత్రలో ధర్మ అదరగొట్టేశాడు. గతంలో సిందూరం అనే మూవీ చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ మూవీలో డ్రింకర్‌గా దుమ్ములేపాడు. తాగుబోతుగా మెప్పిస్తునే.. ఎమోషనల్ సీన్స్‌లో తన నటనతో కట్టిపడేశాడు. బాగీ పాత్రలో ఐశ్వర్య శర్మ అలరించింది. మొదటి మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. వంతెనగా భద్రం కామెడీ వర్కవుట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర మెప్పించారు. 


విశ్లేషణ


తెలుగులో యూత్‌ఫుల్ లవ్ స్టోరీలు చాలానే వచ్చాయి. కాన్సెప్ట్‌ సేమ్ ఉన్నా.. ప్రజెంటేషన్ కొత్తగా ఉంటే కచ్చితంగా ఆడియన్స్‌కు నచ్చుతుంది. డ్రింకర్ సాయి మూవీ సబ్జెక్ట్ కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తూ.. ఫన్‌తో నవిస్తూ దర్శకుడు కథను నడిపించాడు. ట్రైలర్‌ చూస్తే బోల్డ్ మూవీ అనిపించినా.. సినిమా చూస్తే అలాంటి ఫీల్ కలగదు. ఒకటి రెండు చోట్ల అలాంటి డైలాగ్స్ ఉన్నా.. ఇటీవల వస్తున్న సినిమాల్లో కామన్ అయిపోయింది. డైరెక్టర్ తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను చెబుతూ.. చివరలో మద్యం తాగితే జరిగే అనర్థాలపై చక్కటి సందేశం ఇచ్చారు. అయితే సాయి మద్యానికి బానిస కావడం వెనుక కారణాన్ని కాస్త డెప్త్‌గా చూపించి ఉంటే.. ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేది. క్లైమాక్స్ మరింత కన్విన్సింగ్‌గా రాసుకోవాల్సింది. సాంకేతికంగా డ్రింకర్ సాయి బాగుంది. సినిమాట్రోగ్రఫీ చక్కగా కుదిరింది. శ్రీవసంత్‌ అందించిన సాంగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. నిర్మాణ విలువలు స్థాయికి తగినట్లు ఉన్నాయి. 


రేటింగ్: 2.75/3


Also Read: Premi Vishwanath: వంటలక్క కాదు.. సంతూర్‌ మమ్మి.. ఈ కండల వీరుడు ప్రేమీ విశ్వనాథ్‌ కొడుకా..!


Also Read: Toyota 2025 SUV Plans: భారత మార్కెట్‌లోకి టయోటా నుంచి 3 ఎలక్ట్రిక్‌ SUVలు.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook