Toyota 2025 SUV Plans: ప్రతి ఏడాది టయోటా కంపెనీ అద్భుతమైన కార్లను విడుదల చేస్తూ వస్తోంది. ఇందలో భాగంగానే 2025 సంవత్సరంలో కూడా కొత్త కార్లను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే మూడు SUVలను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో చాలా వరకు ఎలక్ట్రిక్ వేరియంట్స్‌లో రాబోతున్నాయి. దీంతో పాటు తొలి ఎలక్ట్రిక్ కారు కూడా ఈ ఏడాదిలోనే విడుదల కాబోతోంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ EV
భారత మార్కెట్‌లోకి టయోటా అర్బన్ క్రూయిజర్ EV కారు 2025 ఏడాదిలో అందుబాటులోకి రాబోతోంది. ఇది ఎలక్ట్రిక్ వేరియంట్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు మార్కెట్‌లోకి లాంచ్ అయితే ఏకైక టయోటా ఎలక్ట్రిక్ కారుగా కాబోతోంది. అయితే దీనిని టయోటా కంపెనీ మారుతి సుజుకి భాగస్వామ్యంతో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది అద్భుతమైన డిజైన్‌తో విడుదల కానుంది.
ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ EV కారు అద్భుతమైన బ్యాటరీ ప్యాక్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా ఫ్రంట్-మౌంటెడ్ మోటార్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు దాదాపు 189 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక దీని మైలేజీ వివరాల్లోకి వెళితే.. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కీలో. మీటర్లకు పైగా మైలేజీని అందించే అవకాశాలు ఉన్నాయి.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
గతంలో విడుదల చేసిన టయోటా అర్బన్ క్రూయిజర్ కారుకు మార్కెట్‌లో మంచి డిమాండ్ అయితే దీని తరహాలోనే కొత్త ఆప్డేట్ కారును అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా 7-సీటర్ వెర్షన్‌లో దీనిని విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు కంపెనీ తెలిపింది.
టయోటా ఈ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారును హైబ్రిడ్ ఇంజన్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారుకు సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. ఇది అద్భుతమైన వీల్‌బేస్‌తో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గత మోడల్ ఇంజన్ లాగే కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం..
టయోటా ఫార్చ్యూనర్ MHEV:
టయోటా ఫార్చ్యూనర్స్‌కి మార్కెట్‌లో ఇప్పటికీ అద్భుతమైన డిమాండ్ ఉంది. ఇది భారత మార్కెట్‌లో పవర్ ఫుల్ ఎస్ యూవీగా పేరు పొందింది. ఈ కారు ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో లభిస్తోంది. అంతేకాకుండా పెద్ద ఇంజన్ కలిగిన కారుగా పేరు పొందింది. త్వరలోనే విడుదల కాబోయే టయోటా ఫార్చ్యూనర్ MHEV ఎలక్ట్రిక్ వేరియంట్‌లో రాబోతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.