Dimple Hayathi Boyfriend : డీసీపీతో గొడవ.. బాయ్ ఫ్రెండ్ సీక్రెట్లు లీక్.. హర్ట్ అయిన డింపుల్ హయతి
Dimple Hayathi Boyfriend గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో డింపుల్ హయతీ వ్యవహారం ఎంతగా వైరల్ అవుతూ ఉందో అందరికీ తెలిసిందే. డీసీపీ రాహుల్ హెగ్డే పెట్టిన కేజు, డింపుల్ తరపు లాయర్ చెబుతున్న విషయాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.
Dimple Hayathi Boyfriend డింపుల్ హయతికి సినిమాల వల్ల కంటే కాంట్రవర్సీ వల్లే పేరు ఎక్కువగా వచ్చినట్టు అయింది. రెండు మూడు రోజుల నుంచి డింపుల్ పేరు మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఐపీఎస్ అధికారి డీసీపీ రాహుల్ హెగ్డే వర్సెస్ డింపుల్ హయతి కేస్ ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఇరు పక్షాల వాదనలూ వైరల్ అవుతున్నాయి. పోలీసు జులుం చూపిస్తున్నాడని, బెదిరించి కేసులు పెడుతున్నాడని డింపుల్ తరపు లాయర్ చెబుతున్నాడు. డింపుల్ పదే పదే ఇబ్బందులు కలగజేస్తోందని, ప్రభుత్వ వాహనాన్ని కాలితో తన్నుతోందని, తన కారుకి అడ్డంగా ఆమె తన కారుని తీసుకొచ్చి పెడుతుందని డీసీపీ రాహుల్ హెగ్డే చెప్పుకొస్తున్నాడు.
డీసీపీ రాహుల్ హెగ్డే కారు డ్రైవర్ ఈ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కారుని కాలితో తన్నిందని ప్రధాన ఆరోపణలున్నాయి. అయితే ప్రైవేట్ ప్లేస్‌లో పబ్లిక్ ప్రాపర్టీ ఎలా పెడతారని, పార్కింగ్‌లో డివైండర్ ఎలా పెడతారని రివర్స్‌లో డీసీపిని ప్రశ్నించారు డింపుల్ తరుపు న్యాయవాది. అయితే ఈ వ్యవహారంతో డింపుల్ బాయ్ ఫ్రెండ్ కూడా బయటకు రావాల్సి వచ్చింది.
డింపుల్ తన బాయ్ ఫ్రెండ్ విక్టర్ డేవిడ్‌తో గత కొన్ని రోజులుగా అదే ఫ్లాట్‌లో ఉంటోందట. ఈ ఘటనతో డింపుల్ రిలేషన్ షిప్, డేటింగ్ గురించి వివరాలు బయటకు వచ్చాయట. తన బాయ్ ఫ్రెండ్ పేరు ఇలా బయటకు రావడం, డేటింగ్ విషయాలు లీక్ అవ్వడంతో డింపుల్ అసహనం వ్యక్తం చేస్తోందట.
Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?
అసలే డింపుల్‌కు సరైన హిట్లేమీ లేవు. చివరగా గోపీచంద్ రామబాణంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో డింపుల్ మీద ఐరన్ లెగ్ అన్న ముద్ర పడింది. రవితేజ ఖిలాడీ సైతం ఇలానే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఆమె గద్దల కొండ గణేష్ సినిమాలో చేసిన ఐటం సాంగ్ మాత్రమే కాస్త పాపులర్ అయింది.
Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK