Anurag Kashyap Daughter: ఇటీవలి కాలంలో టీవీ సెలబ్రిటీలు, సినీ సెలబ్రిటీలు, సెలబ్రిటీల పిల్లలు యూట్యూబ్‌ ఛానెళ్లపై పడిపోయారు. ఏదో ఒక యాక్టివిటీకి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసి నెటిజన్లతో ఎంగేజ్ అవుతున్నారు. ఫన్నీ వీడియోలు, హోమ్ టూర్స్, వంటలు, ఇలా రకరకాల వీడియోలతో నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. కానీ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ మాత్రం ఇందుకు కాస్త భిన్నమనే చెప్పాలి. తన పేరిట యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఆమె... ఇటీవలి కాలంలో బోల్ట్ టాక్ సెషన్స్‌తో నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో భాగంగా గర్ల్స్ టాక్ పేరిట నెటిజన్లతో ముచ్చటించిన ఆలియా కశ్యప్ కొన్ని బోల్డ్ టాపిక్స్‌కి అంతే బోల్డుగా సమాధానాలిచ్చింది. అమ్మాయిలు మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు రక్తస్రావం అవుతుందా అనే ప్రశ్నకు.. కొందరికి అవుతుంది... కొందరికి అవదు అంటూ సమాధానమిచ్చింది. అంతేకాదు, తనకైతే మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు బ్లీడింగ్ జరగలేదని చెప్పింది. 


వక్షోజాల సైజు తక్కువగా ఉండటం వల్ల కొంతమంది అమ్మాయిలు బాధపడుతుంటారని... వక్షోజాల సైజు నిజంగా అంత పట్టించుకోవాల్సిన విషయమా అంటూ ఎదురైన ప్రశ్నకు... నో అంటూ సమాధానమిచ్చింది. అంతేకాదు, తనకు చిన్న వక్షోజాలే ఉన్నాయని... తాను వాటిని ప్రేమిస్తానని చెప్పింది. మీ పార్ట్‌నర్ కాస్త పరిణతితో ఉండే వ్యక్తి అయితే ఆ విషయం పెద్దగా పట్టించుకోడని పేర్కొంది. తానెప్పుడూ స్పోర్ట్స్ బ్రాలే ధరిస్తానని... ప్యాడెడ్ బ్రా ధరించనని తెలిపింది.


ఇక మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు భయం, తెలియని ఇబ్బంది వంటివి సహజమేనా అన్న ప్రశ్నకు అవునంటూ సమాధానమిచ్చింది. మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు ప్రతీ ఒక్కరికీ అలాగే అవుతుందని తెలిపింది. రిలేషన్‌షిప్‌లో దయ, విధేయతతో ఉండటం చాలా ముఖ్యమని... అహంకారపూరితంగా, ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండటం తనకు నచ్చదని చెప్పుకొచ్చింది. ఆలియా కశ్యప్ పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకూ 41 వేల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ చానెల్‌కి 1 లక్ష పైచిలుకు సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 



Also Read: NewBrew Beer: మార్కెట్లోకి కొత్త బీర్ బ్రాండ్... మూత్రం, డ్రైనేజీ నీళ్లతో తయారీ...


Also Read:   Yama Raj Death Signals: మృత్యు గడియలు సమీపించే ముందు కనిపించే 4 సంకేతాలివే...  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook