Ram Gopal Varma: పోలీసులకు షాకిచ్చిన రామ్ గోపాల్ వర్మ.. 26 ప్రశ్నలతో సంచలనం
Ram Gopal Varma Sensation 26 Questions To Police: కేసుల భయంతో తాను పారిపోయానని.. ఎక్కడో వేరే రాష్ట్రాల్లో దాక్కున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులకు భారీగా ప్రశ్నలు సంధించి షాకిచ్చాడు.
RGV Arrest: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేయడం.. అరెస్ట్‌కు రంగం సిద్ధమైందని జరుగుతున్న ప్రచారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. తనను ఎవరూ అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదని తేల్చి చెప్పారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలోనే ఉన్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు.
ఇది చదవండి: Allu Arjun: రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీడియో వైరల్
కేసుల భయంతో పరారీలో ఉన్నాడని.. పోలీసులు వెతుకుతున్నారని ప్రచారం జరుగుతుండడంపై రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఏకంగా 26 ప్రశ్నలు సంధించారు. కేసులు ఎందుకు పెట్టారో.. ఎవరు పెట్టారో తెలుసని.. పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను చేసిన తప్పేమీ లేదని.. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. పోలీసులు ఎవరూ నా ఆఫీస్ కడప తొక్కలేదని ప్రకటించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా తాను పోరాడుతానని తెలిపారు. ఈ సందర్భంగా వర్మ సంధించిన 26 ప్రశ్నలు ఇవే.
ఇది చదవండి: Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రికి మళ్లీ మేకప్.. రాజధాని అమరావతి చేరువలో 'హరి హర వీర మల్లు' షూటింగ్
ట్విటర్ వేదికగా ఆర్జీవీ ప్రశ్నలు ఇవే!
1. నేను ఏదో పరారీలో ఉన్నా. ఇంకా మహారాష్ట్ర, చెన్నైలాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్లందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నా. అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్లడం తప్ప.
2. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒకవేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు?
3. నా మీద కేసు ఏమిటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పెట్టానని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్‌గా అసలు సంబంధం లేని వ్యక్తులా మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారంట.
4. ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే నలుగురు వేర్వేరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు. ఇవన్నీ కూడా కేవలం నాలుగు ఐదు రోజుల్లోనే నమోదయ్యాయి.
5. నాకు నోటీసు అందిన వెంటనే నా సినిమా పనులతో సంబంధిత అధికారిని కొంత సమయం కోరగా ఆయన కూడా అనుమతించారు. కానీ నా పనులు పూర్తి కాకపోవడంతో మరికొంత సమయం అడగడం, లేకపోతే వీడియో ద్వారా హాజరవుతానని తెలిపా. అదే సమయంలో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదవడం వెనక ఏదో కుట్ర ఉందని నాకు.. నా వాళ్ల అనుమానం వచ్చింది.
6. నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని. ఒక సంవత్సరంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటా. వాళ్లు నేను పెట్టాను అంటున్న పోస్టులు.. నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించినవి. ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం.. ఆ చిత్రం విడుదల అవవడం కూడా చాలా నెలల క్రితం జరిగిపోయింది.
7. నేను పెట్టాను అంటున్న పోస్టులు వేటి వల్ల అయితే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల లో తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది.
9. ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి.
12. బీఎన్ఎస్ 336(4). ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం
నేను చేసిన పోస్టుల చూస్తే , అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి?
13. బీఎన్ఎస్ 353(2). తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా.. మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం. నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు.
14. బీఎన్ఎస్ 356. (1). ఎవరైనా మాటల ద్వారా గానీ, రాతల ద్వారా గానీ, సంకేతాల ద్వారా గానీ, చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం. మీమ్లతో పరువు నష్టం దావాలేస్తే రోజుకి లచ్చ కేసులవుతాయి.
16. బీఎన్ఎస్ 61(2). ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక మోసపూరిత విధానం లో చద్దబద్దమైన ఫలితం పొందడం. దీని లింక్ నా కేసుకు ఏంటి?
17. బీఎన్ఎస్ 196. వేర్వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మ స్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం?
18. సెక్షన్ 67 ఐటీ చట్టం. ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించిన లేదా ప్రసారం చేసినా లేదా ప్రసారం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా, కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించడం. సెక్షన్ 67 కేవలం అసభ్యకర విషయాల్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం. ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది?
19. నా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం , భారత రాజ్యాంగం ARTICLE 19(1)a ప్రకారం న్యాయబద్దమైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్చగా తెలియజేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు.
20. ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూలస్తంభం వాక్ స్వాతంత్రం. దాని ప్రథమ లక్షణం, ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్ గా మాట్లాడగలగడం.. అదే విధంగా ఇతరుల నుండీ ఏ విధంగానైనా వచ్చే వాటినీ స్వీకరించటం. ఇది స్వేచ్చ ప్రధాన హక్కు.. ఈ హక్కును నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం.
21. ఈ మీమ్ అనే భావప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను,భావాలను, ఉద్దేశాలను, శైలీని,ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్ లో ముఖ్య భాగం అయ్యింది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము etc రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే
22. మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ,బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తుంటారు…ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్ గా తీసుకుంటే దేశం లొ సగం మంది పైన కేసు పెట్టాలి.
23. ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే, నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారనకి హాజరవడానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు నా ఆఫీసుకు వచ్చారు. కానీ వాళ్లు నా ఆఫీసు లోపలకి రాలేదు. నన్ను అరెస్టు చేయడానికి వచ్చామని కూడా చెప్పలేదు.
24. ఇప్పుడూ మీడియా లో వస్తున్న కథనాలు.. నన్ను పట్టుకోవటానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు, వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు, నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు.. కానీ ఈ మీడియా ప్రతిసారి లాగే హైడ్రామా క్రియేట్ చేసింది.
25. నేను నా మొబైల్ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రధాన కారణం. లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి. ఇప్పటివరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ సమయానకి నాకు ఆఫీసర్ల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నా మీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదవడమనేది ఏదో కుట్ర జరుగుతుందనిపించి.. అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశా. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తీ నీ లేక ఒక గ్రూప్‌ను నిందించడం లేదు. కానీ వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థం అవుతోంది.
26. నేను చట్టాన్ని గౌరవిస్తా. అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తా. కానీ దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటా.
ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ కేరక్టర్‌గా చేసి ఒక సినిమా తీసింది. నాకు కూడా వాళ్లకున్నంత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.