Venkat Prabhu Imitates Dil Raju: దిల్ రాజుని ఇమిటేట్ చేసిన తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు
Director Venkat Prabhu Imitates Dil Raju Tamil Slang: వారసుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు తమిళంలో మాట్లాడేందుకు ప్రయత్నించి అప్పటి నుంచి ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన క్రమంలో ఆయనని వెంకట్ ప్రభు ఇమిటేట్ చేశారు.
Director Venkat Prabhu Imitates Dil Raju: తలపతి విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరుగుతున్న నేపథ్యంలో దిల్ రాజు అక్కడికి వెళ్లి తమిళంలో మాట్లాడేందుకు ప్రయత్నించి అప్పటి నుంచి ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సార్ డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, కామెడీ వేణుమా కామెడీ ఇరుక్కు అంటూ ఇరుక్కు భాషలో మాట్లాడి అందరికీ నవ్వులు తెప్పించారు దిల్ రాజు.
ఇప్పుడు ఆయనని ఒక తమిళ దర్శకుడు ఇమిటేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటించిన కస్టడీ సినిమా మే 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఇక శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతోంది.
Also Read: SSMB 28 Problems: మహేష్-త్రివిక్రమ్ సినిమాకి కొత్త సమస్యలు.. అసలు సంగతి ఏంటంటే?
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చైతన్య గారి స్టైల్ ఉంది, యాక్షన్ వేణుమా యాక్షన్ ఉంది, పర్ఫామెన్స్ వేణుమా పర్ఫామెన్స్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ వేణుమా సెంటిమెంట్ ఉంది, మాస్ వేణుమా మాస్ ఉంది, ఎల్లామే ఉంది అంటూ అక్కడ ఒక్కసారిగా అందరి ముఖాల మీద నవ్వులు పూయించారు.
అంతేకాదు ఈ సినిమా తరువాత రెండో భాగం కూడా ఉండే అవకాశం ఉందని హింట్ ఇచ్చేశారు దర్శకుడు వెంకట్ ప్రభు. ఇక ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ లుగా నిలుస్తున్న అన్ని సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో హిట్ ఇచ్చిన సినిమాలను వదలకుండా సీక్వెల్స్ చేస్తున్నారు. ఈ కస్టడీ సినిమాని శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీ శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read: Adah Sharma Craze: 15 ఏళ్ల తరువాత హీరోయిన్ గా బ్రేక్ అందుకున్న ఆదా శర్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook