Adah Sharma Finally got craze with ‘The Kerala Story’: మహారాష్ట్రలోని ముంబైలో ఇండియన్ మర్చంట్ నేవీలో పనిచేసే తమిళనాడు బ్రాహ్మణ తండ్రికి, మలయాళీ తల్లికి జన్మించింది ఆదా శర్మ. చదువుకునే రోజుల్లోనే ఆమెకు సినీ పరిశ్రమ మీద ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన 1920 అనే ఒక హారర్ సినిమాలో లీసా సింగ్ రాథోడ్ అనే పాత్రతో ఆమె హిందీ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా లాంచ్ అయింది.
ఆ సినిమా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. తరువాత ఫిర్ అనే మరో సినిమా హమ్ హై రాహి కార్కే అనే మరో సినిమాలో కూడా నటించింది. ఇన్ని సినిమాలు ఆమె హిందీలో చేసినా ఎందుకో ఆమెకు సరైన బ్రేక్ దొరకలేదు. ఆ తర్వాత తెలుగులో హార్ట్ ఎటాక్ అనే సినిమాతో హయతి పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చింది కానీ అది కూడా కలిసి రాలేదు.
Also Read: Kushi Movie Getups: ఖుషీలో అప్పుడు ముస్లింగా దేవరకొండ.. ఇప్పుడు సమంత.. ఇదేందయ్య ఇదీ!
తర్వాత మరో హిందీ సినిమా చేసింది, అది కలిసి రాకపోవడంతో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు పరిమితమైంది. ఇక ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించింది. ఇక ఆ తర్వాత తమిళ హిందీ భాషల్లో నటిస్తూ వచ్చిన ఈ భామ కల్కి అని తెలుగులో చివరిగా కనిపించింది. తర్వాత ఎక్కువగా హిందీ సినిమాల్లో భాగమవుతున్న ఈ భామ తాజాగా ‘ది కేరళ స్టోరీ’ అనే సినిమాతో ఒక్కసారిగా అందరి మనసులు దోచేసింది.
ఇందులో శాలిని ఉన్నికృష్ణన్ అనే ఒక హిందూ యువతి పాత్రలో నటించింది. సినిమా మొత్తానికి ఆమెదే లీడ్ రోల్ అని లీడ్ రోల్ అని చెప్పొచ్చు. దాదాపుగా సినీ రంగ ప్రవేశం చేసి 14 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఆమెకు ఇప్పుడు సరైన బ్రేక్ దొరికిందని చెబుతున్నారు. మొత్తం మీద ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో ఆదా శర్మ మరిన్ని మంచి అవకాశాలు అందుకుని ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది.
Also Read: Rakshitha Suresh: రోడ్డు ప్రమాదానికి గురైన పాపులర్ సింగర్.. చచ్చి బతికానంటూ పోస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook