Mega family vs Allu Arjun: మెగా కుటుంబం వర్సెస్ అల్లు అర్జున్ వివాదం పెరుగుతోంది. కుటుంబసభ్యుల సంగతెలా ఉన్నా ఇరువురి అభిమానులు మాత్రం వివాదాన్ని రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా సాక్షిగా వార్ పెరుగుతోంది. అసలేం జరిగింది..ఎందుకీ వివాదం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్..పుష్ప సినిమాతో, వరుస హిట్లతో దూసుకుపోతున్న పాన్ ఇండియా హీరో. మెగా కుటుంబసభ్యుడు. స్వయానా చిరంజీవి బావమరిది తనయుడు. అయితే ఇప్పుడు కొత్త వివాదం రచ్చవుతోంది. అది కూడా మెగా కుటుంబసభ్యులకు..అల్లు అర్జున్‌కు మధ్యనో కాదో తెలియదు కానీ..ఇరువురి అభిమానుల మధ్య మాత్రం వార్ పెరుగుతోంది. అల్లు అర్జున్‌తో మెగా ఫ్యామిలీకు దూరం ఉందనే విషయాన్ని ఫ్యాన్స్ ధృవీకరిస్తున్నారు. ఇటీవల మెగా ఫ్యాన్స్ అంటే..చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ అభిమానులు చేసిన ఓ పని..బన్నీ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. 


ఇటీవల మెగా అభిమానులు, జనసేన సభ్యులు కలిసి మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఒకటి నిర్వహించారు. ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయుడు నేతృత్వంలో విజయవాడలో ఈ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, నాగబాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అల్లు అర్జున్ ఫోటో లేదిందులో. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ అలియాస్ బన్ని అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు. మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్‌ని దూరం చేశారని..అందుకే ఇలా చేశారని అంటున్నారు. అటు సమావేశంలో కూడా చిరంజీవి, మెగా ఫ్యామిలీ తప్ప మరెవరూ అవసరం లేదని..వారిని లెక్కలో తీసుకోవల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. 


దీనికి ప్రతిగా బన్నీ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఓ హ్యాష్‌ట్యాగ్ రన్ చేస్తున్నారు. ఏం పీకలేరు బ్రదర్ పేరుతో ఓ హ్యాష్‌ట్యాగ్ వైరల్ చేసేందుకు బన్నీ అభిమానులు ప్రయత్నిస్తున్నారు. ఈ వాదనలు ఎంతవరకూ వెళ్లాయంటే..అల్లు రామలింగయ్య కారణంగానే చిరంజీవి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని..బన్నీ అభిమానులు చెబుతుంటే..మెగా కుటుంబం లేకపోతే మీరెక్కడంటూ చిరు అభిమానులు వాదిస్తున్నారు. కుటుంబసభ్యులు, రెండు కుటుంబాల మధ్య అంతర్గతంగా ఎలా ఉన్నా..ఫ్యాన్స్ మాత్రం వార్ కొనసాగిస్తున్నారు. 


Also read: Aishwarya Rajesh Pics: స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, రెడ్‌ కలర్‌ శారీ కట్టి.. హోయలు పోతున్న ఐశ్వర్య రాజేష్! కుర్రాళ్లకి దేత్తడి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook