Prabhas Adipurush : ఆదిపురుష్ ఎలా ఉండోబోతోందో చెప్పిన కెమెరామెన్.. ఇక డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండుగే
Adipurush VFX Trolls ఆదిపురుష్ సినిమా వీఎఫ్‌ఎక్స్ మీద జరిగిన ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదిపురుష్ విజువల్స్, లుక్స్ మీద దేశం మొత్తం పెదవి విరించింది. అయితే ఆదిపురుష్ టీం మాత్రం ఆ ట్రోలింగ్‌కు బదులు చెప్పేందుకు రెడీ అయింది.
Karthik Palani About Adipurush గత ఏడాది కొన్ని సినిమాలు ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయ్యాయి. ఆచార్య, లైగర్, ఆదిపురుష్ వంటి సినిమాలను జనాలు ఏకిపారేశారు. ఇందులో ఆదిపురుష్ కథ కాస్త భిన్నం. ఆదిపురుష్ నుంచి వచ్చిన చిన్న పాటి టీజర్ దేశ మొత్తంగా చర్చకు దారి తీసింది. ఆదిపురుష్ కోసం ప్రభాస్ పడ్డ కష్టంగానీ, ఓం రౌత్ టాలెంట్‌గానీ కించిత్ కూడా కనిపించలేదు సరికదా.. చిన్న పిల్లల కార్టూన్స్, గ్రాఫిక్స్ చూసినట్టుగా ఉందని ట్రోల్ చేశారు.
ఇదేమీ కొత్తగా లేదని, పైగా సిల్లీగా ఉందని, దీని కంటే రజినీకాంత్ కొచ్చాడియన్ బెటర్‌గా ఉందని, వీఎఫ్‌ఎక్స్ కోసం అన్ని కోట్లు పెట్టారంటే నమ్మాలనిపించడం లేదంటూ ఇలా నానా రకాలుగా ట్రోల్స్ చేశారు. అయితే ఇది మొబైల్ కోసం తీసిన సినిమా కాదని, థియేటర్లో త్రీడీ కోసం తీసిన సినిమా అంటూ ఓం రౌత్ కాస్త సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు తమ తమ తప్పులను ఒప్పుకుని ప్యాచ్ వర్క్ చేసేందుకు రెడీ అయ్యాడు.
దాని కోసం మరో వంద కోట్లు కూడా అధనంగా పెట్టినట్టు టాక్. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కెమెరామెన్ కార్తిక్ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సినిమాలో చాలా మార్పులు వచ్చాయని, ఇది అవుట్ అండ్ అవుట్ బ్లూ స్క్రీన్ మూవీ అని చెప్పుకొచ్చాడు. నటీనటులు మాత్రమే మా ముందుంటారు.. కానీ దాని చుట్టు ప్రపంచం ఎలా ఉండబోతోందని తాము ఊహించుకుని షూట్ చేయాల్సి ఉంటుందని కార్తీక్ అన్నాడు.
ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను అని తెలిపాడు. మా మీద ట్రోలింగ్ జరిగిన మాట వాస్తవమే.. ఇప్పుడు ఈ సినిమాలో ఎంతో ఇంప్రూవ్మెంట్ జరిగింది.. సినిమా చూశాక మీకే తెలుస్తుంది.. ఇప్పటి వరకు చూసిన దాని కంటే ఎంతో భిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక కొచ్చాడియన్ అనేది కేవలం పూర్తిగా మోషన్ పిక్చర్‌లో క్యాప్చర్ చేశారని, ఇందులో లైవ్ యాక్షన్ ప్లస్ మోషన్ పిక్చర్ రెండూ ఉంటాయని అన్నాడు.
Also Read: Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?
Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook