Drugs Queen Niharika: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో నిహారిక కొణిదెల కూడా ఉన్నట్లు ప్రచారం జరగడం... పోలీస్ స్టేషన్ నుంచి నిహారిక బయటకొస్తున్న దృశ్యాలు మీడియాలో సర్క్యులేట్ అవుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిహారికపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. నిహారికను టార్గెట్ చేస్తూ #DrugsQueenNiharika అనే హాష్ ట్యాగ్‌‌ను నెటిజన్లు ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిహారిక కొణిదెల కాస్త ఇక నుంచి డ్రగ్స్ నిహారిక కొణిదెల అంటూ విమర్శిస్తున్నారు. నిహారిక తప్పు లేదంటూ నాగబాబు విడుదల చేసిన వీడియోపై కూడా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తెల్లవారుజాము దాకా పబ్ ఓపెన్ చేసి ఉండటం యాజమాన్యం తప్పేనని... కానీ అర్ధరాత్రి 2 గంటల దాకా కూతురు భర్తను వదిలేసి పబ్‌లలో చిందులు వేయడం తప్పు కాదా అని నాగబాబును నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


నిహారికను చూస్తే గర్వంగా ఉందంటూ గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు ఇంకా గర్వపడు నీ కూతురిని చూసి అని ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు ట్రోల్స్‌పై నాగబాబు తనదైన శైలిలో స్పందించారు. తన కూతురు డ్రగ్స్ క్వీన్ కాదని... 'మెగా లిటిల్ ప్రిన్సెస్' అని ట్వీట్ చేశారు. నాగబాబు ట్వీట్‌పై కూడా ట్రోలర్స్ సెటైర్స్ సంధిస్తున్నారు.


ఇక ఈ కేసులో 150 మంది వరకు పట్టుబడగా.. ఇందులో చాలామంది వీవీఐపీల పిల్లలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకూ కొద్ది మంది పేర్లు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. మొదట రాహుల్ సిప్లిగంజ్ ఒక్కడి పేరే బయటకొచ్చింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్ ఈజీ టార్గెట్ కాబట్టే మొదట అతని పేరే బయటపెట్టారని.. నిహారిక కొణిదెల సహా పలువురి పేర్లు బయటకు వెల్లడించలేదని అంటున్నారు. ఏదేమైనా ఈ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. 







Also Read: Niharika Konidela: నిహారిక తప్పు లేదు.. అనవసర ఊహాగానాలు వద్దు... నాగబాబు రియాక్షన్


Hyderabad Drugs Case: నిజానిజాలు తెలుసుకోకుండా నన్నెందుకు బద్నాం చేస్తున్నారు.. మీడియాపై నటి హేమ ఫైర్... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook