Ravi Teja Eagle Review: మాస్ మహారాజా రవితేజ హీరోగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఈగల్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉన్నా.. థియేటర్స్ తీవ్ర పోటీ కారణంగా వాయిదా పడింది. విడుదల విషయంలో ఒక అడుగు వెనకడుగు వేసినా.. ఈ మూవీపై ఫ్యాన్స్‌కు మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన మేకింగ్ విజువల్స్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈగల్ మూవీపై ఫుల్ పాజిటివ్ టాక్ నడుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Cockroach Vande Bharat Train: భోజనంలో బొద్దింక.. 'వందే భారత్‌' ప్రయాణికుడికి విస్తుగొల్పే ఘటన


టీజర్, ట్రైలర్ స్టైలీష్‌గా ఉండటం.. మేకింగ్ పరంగా కూడా ఆకట్టుకోవడంతో మాస్ మహారాజా హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా కెమెరామెన్ నుంచి డైరెక్టర్‌గా మారనున్నారు కార్తీక్ ఘట్టమనేని. ఆ పనితనం ట్రైలర్‌లో క్లారిటీగా కనిపిస్తోంది. సాధారణంగా ట్రైలర్ రిలీజ్‌తో కథ ఏంటో అందరికీ తెలుస్తుంది. కానీ ఈగల్ మూవీ ట్రైలర్‌తో కథ ఏంటనే విషయం ఎక్కడా రివీల్ అవ్వలేదు. దీంతో సినిమాను చూడాలనే ఆసక్తిని క్రియేట్ చేశారు మూవీ మేకర్స్. 


ఇక తాజాగా ఈగల్ మూవీ ప్రివ్యూను చూసిన హీరో రవితేజ, దర్శక నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. సినిమా చూస్తున్నంతసేపు రవితేజ చిన్న పిల్లాడిలా మారిపోయారు. మాస్ మహారాజా ఫస్ట్ రియాక్షన్, ఫస్ట్ రివ్యూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫుల్ హ్యాపీ అంటూ రవితేజ ఇచ్చిన రియాక్షన్‌తో ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. రికార్డులు బద్దలు కొట్టేస్తామంటూ కాలర్ ఎగేరేసుందుకు రెడీ అవుతున్నారు. 


 




మరోవైపు ఈగల్‌ మూవీకి సంబంధించిన టికెట్ రేట్ల విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీ సినిమా టికెట్ రేట్లు యాధాతథంగా ఉండనున్నాయి. సాధారణ టికెట్ రేట్లతోనే ఈగల్ మూవీ బాక్సాఫీసు వద్ద బరిలోకి దిగుతోంది. మల్టీప్టెక్సులో గరిష్టంగా రూ.200 వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక సింగిల్ స్క్రీన్‌లో అత్యధికంగా రూ.150 వరకు ఉండనున్నట్లు సమాచారం. ఫుల్ పాజిటివ్‌ టాక్‌తో ఆడియన్స్ ముందు రానున్న ఈగల్ సూపర్ హిట్‌గా నిలుస్తోందో లేదో చూడాలి మరి.


Also Read: Viral News: ఇదేంది సారూ... పీకల దాక తాగి స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయుడు.. వైరల్ గా మారిన వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి