Evaru meelo koteeswarudu: కౌన్ బనేగా క్రోర్‌పతి తెలుగు వెర్షన్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రారంభ ఎపిసోడ్ వేదికను ఇవాళ ఇద్దరు టాప్ హీరోలు పంచుకోనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందీలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి ఎంతటి పాపులర్ షోగా మారిందో అందరికీ తెలుసు. ఆ కార్యక్రమం లాంటిదే తెలుగులో ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఎవరు మీలో కోటీశ్వరుడు పేరుతో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం రెగ్యులర్ ఎపిసోడ్స్ మాత్రం రేపట్నించి మొదలవుతాయి. ప్రారంభ ఎపిసోడ్ కాస్త విభిన్నంగా, ప్రత్యేకంగా తీర్దిదిద్దారు. ఇవాళ రాత్రి అంటే ఆగస్టు 22వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే విడుదలై సంచలనం కల్గిస్తోంది. 


ఎవరు మీలో కోటీశ్వరుడు(Evaru meelo koteeswarudu)ప్రారంభ ఎపిసోడ్‌ను జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr), రామ్‌చరణ్(Ramcharan)పంచుకోనుండటం విశేషం. ఈ ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలతో రూపుదిద్దుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీ మరి కొద్దిరోజుల్లో విడుదల కానుంది. ఈలోగా బుల్లితెరపై ఇవాళ సందడి చేయనున్నారు. ఇవాళ్టి ప్రారంభ ఎపిసోడ్ రామ్ వర్సెస్ రామ్‌గా(Ram vs Ram) ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్ భారీగా టీఆర్పీ నమోదు చేస్తుందనే అంచనాలతో నిర్వాహకులున్నారు. 


Also read: Megastar Chiranjeevi: అభిమానులకు పిలుపునిచ్చిన చిరు, పుట్టినరోజున ఏం చేయాలంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook