Bharateeyudu 2 Movie: వరెస్ట్ కేమియో.. భారతీయుడు-2లో బ్రహ్మానందంకు అన్యాయం.. మెరుపు తీగలా..!
Brahmanandam Role In Bharateeyudu 2: భారతీయుడు-2లో బ్రహ్మానందం ఉన్నారు. సినిమా చూసిన వాళ్లు అవునా ఉన్నారా..? ఎక్కడ అనుకుని కాసేపు రివైన్ చేసుకుంటే రెండు మూడు షాట్స్‌లో కనిపిస్తారు. సినిమా రిలీజ్‌కు శంకర్ హైప్ ఇవ్వగా.. మూవీలో మాత్రం ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు.
Brahmanandam Role In Bharateeyudu 2: భారీ అంచనాలతో బాక్సాఫీసు ముందుకు వచ్చిన భారతీయుడు-2 మూవీ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా ఎమోషనల్‌గా ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేకపోయింది. భారతీయుడు, అపరిచితుడు సినిమాలను మిక్స్‌లో వేసి బయటకు తీస్తే.. భారతీయుడు-2 మూవీ వచ్చినట్లు ఉంది. మూవీ డిజాస్టర్ వైపు సాగుతుండగా.. నెట్టింట భారీ ట్రోలింగ్ జరుగుతోంది. మేకింగ్ పరంగా శంకర్ మంచి మార్కులు కొట్టేసినా.. స్టోరీలో సోల్ మిస్ అవ్వడంతో మొదటికే మోసం జరిగింది. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేపోయాయి. ఇక చివర్లో భారతీయుడు-3 ట్రైలర్ రిలీజ్ చేసి.. కాసింత హైప్ క్రియేట్ చేసింది.
భారతీయుడు-2లో బ్రహ్మానందం కేమియో రోల్‌లో మెరిశారు. బ్రహ్మానందానికి తాను పెద్ద అభిమాని అని.. ఆయన యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పారు శంకర్. ఈ సినిమా కోసం ఆయనను అడగ్గానే ఒప్పుకున్నారని శంకర్ చెప్పగా.. బ్రహ్మానందంకు మంచి రోల్ ఇచ్చారేమోనని ఆడియన్స్ అనుకున్నారు. అయితే సినిమా చూస్తే బ్రహ్మానందంకు అన్యాయం చేశాడనిపిస్తుంది. బ్రహ్మానందం కామెడీ ఉంటుందని అనుకుంటే.. రెండు మూడు షాట్స్‌కే పరిమితం చేశారు. ఏదో మెరుపు తీగలాగా అలా స్క్రీన్ మీద కనిపించారు. ఇందుకోసమేనా బ్రహ్మానందం వంటి యాక్టర్‌ను తీసుకున్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. నిజానికి ఈ పాత్రకు బ్రహ్మానందం అవసరం లేదు. ఉన్నా రిలీజ్‌కు ముందు శంకర్ అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరీ మూడో పార్టులో అయినా బ్రహ్మానందం రోల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడేమో చూడాలి. వచ్చే ఏడాది భారతీయుడు-3 సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
భారతీయుడు 2 మూవీ తొలిరోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.26.1 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళ్‌లో రూ.16 కోట్లు, తెలుగులో రూ.8 కోట్లు వచ్చినట్లు సమాచారం. బాలీవుడ్‌లో భారతీయుడు-2 పరిస్థితి దారుణంగా ఉంది. కేవలం రూ.కోటి మాత్రమే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్-శంకర్ కాంబోలో మూవీకి ఇంత తక్కువ కలెక్షన్స్ రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక తెలంగాణలో టికెట్ రేట్లు పెంచడం, మూవీకి నెగిటివ్ టాక్ రావడం కూడా కలెక్షన్స్‌పై మరింత ప్రభావం చూపనుంది.
Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి