Movies to be release: కరోనా టైమ్ ముగిసింది. ఇక సినిమాల్ని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేసుకోవచ్చు. సంక్రాంతి కలెక్షన్లు నిర్మాతలకు నమ్మకాన్ని పెంచాయి. అందుకే ఫిబ్రవరిలో ఒకేరోజు నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


థియేటర్లు తెర్చుకున్నాక ప్రారంభంలో నిరాశ ఎదురైనా..అనంతరం అంటే సంక్రాంతి ( Sankranti ) కి పరిస్థితి మెరుగుపడింది. సంక్రాంతి సమయంలో సినిమాల కలెక్షన్ ( Sankranti Collections ) నిర్మాతల్లో ఊపు తెచ్చింది. ఇకపై థియేటర్లలో సినిమాలు విడుదల చేయవచ్చనే అభిప్రాయానికి వచ్చారు. మరీ ముఖ్యంగా మాస్టర్ సినిమా ( Master Movie ) కు గతంలో ఉన్నట్టే వసూళ్లు రావడం ఆనందాన్నిచ్చింది. ఏకంగా వంద కోట్ల కలెక్షన్ వారం రోజుల్లోనే రావడం చిన్న విషయం కాదు. అటు రవితేజ నటింటిన క్రాక్ ( Krack movie ) సినిమా కూడా 2 వారాల్లో 35 కోట్లు వసూలు చేసింది. అటు రవితేజ ( Raviteja ) కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 


Also read: Uppena Movie: ఉప్పెన మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన Mythri Movie Makers


అయితే పండగైపోయింది కదా..ఇక సినిమాలు లేవనుకుంటున్నారా. చాలా ఉన్నాయి విడుదలకు సిద్ధంగా. వాలెంటైన్ వీకెండ్ ( Valentine Weekend ) కోసం సినిమాలు రెడీ చేస్తున్నారు నిర్మాతలు. ఫిబ్రవరి 12న ఏకంగా 4 సినిమాలు ( Four movies to be release on February 12 ) విడుదల కానున్నాయి. ఈ నాలుగు సినిమాల్లో 2 భారీ సినిమాలు కాగా..మరో రెండు మాదిరి అంచనాలు కలిగి ఉన్నాయి. 


చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఉప్పెన ( Uppena ) ఫిబ్రవరి 12 న విడుదల కానుంది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు తెరకెక్కించారు. ఇక రెండవ సినిమా చక్ర ( Chakra ) . యాక్షన్ హీరో విశాల్ నటిస్తున్న చక్ర కూడా ఫిబ్రవరి 12నే విడుదలవుతోంది. అభిమన్యుడు తరువాత మరోసారి విశాల్ టెక్నికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక మూడవ సినిమా FCUK ( FCUK ) .. జగపతి బాబు నటించిన రోమాంటిక్ ఎంటర్ టైనర్ FCUK. ఇప్పటికై విడుదలైన ట్రైలర్ బాగా పాపులరైంది. ఫిబ్రవరి 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. నాలుగో సినిమా ఆది సాయి కుమార్ నటిస్తున్న శశి ( Sasi ). ఇదే రోజు విడుదల కానుంది. 


Also read: Shilpa Shetty Trolls: గణతంత్ర దినోత్సవం రోజు నటి శిల్పాశెట్టిని ఆటాడుకుంటున్న నెటిజన్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook