Uppena Movie: ఉప్పెన మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన Mythri Movie Makers

Uppena Movie Set To Release On February: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్,  కృతిశెట్టి తొలి పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. సినిమా విడుదలకు ముందే ఆడియో పరంగా సక్సెస్ సాధించింది ఈ సినిమా. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 26, 2021, 06:21 PM IST
  • మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్న హీరో
  • బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి తొలి పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’
  • ఉప్పెన మూవీ విడుదల తేదీపై మైత్రీ మూవీ మేకర్స్ అప్‌డేట్ ఇచ్చింది.
Uppena Movie: ఉప్పెన మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన Mythri Movie Makers

Uppena Movie Set To Release On February 12: మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్న హీరో, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్(Vaishnav Tej). డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి తొలి పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’ (Uppena Movie) మూవీ అప్‌డేట్ వచ్చింది.

 

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉప్పెన మూవీ విడుదల గతేడాది వాయిదా పడింది. తాజాగా ఉప్పెన మూవీ(Uppena Movie Release Date Update) విడుదల తేదీపై మైత్రీ మూవీ మేకర్స్ అప్‌డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 12 ఉప్పెన మూవీ విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సినిమా పాటలు ఎంత హైలైట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

Also Read: Shilpa Shetty Trolls: గణతంత్ర దినోత్సవం రోజు శిల్పాశెట్టిని ఆటాడుకుంటున్న నెటిజన్స్

  

 

ముఖ్యంగా సినిమాలో నీ కన్ను నీలి సముంద్రం.. పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. వాస్తవానికి కరోనా వైరస్ సమస్య లేకపోతే ఏప్రిల్ తొలి వారంలో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) తొలి సినిమా ఉప్పెన విడుదల కావాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఉప్పెన మూవీ ఓటీటీలో విడుదల అవుతుందనుకున్నారు. కానీ ఎట్టకేలకు థియేటర్లలో ఉప్పెన విడుదలకు సిద్ధమైంది.

Also Read: Ravi Teja పుట్టినరోజు కానుకగా Khiladi Movie First Glimpse రిలీజ్ చేసిన మూవీ యూనిట్

 

ఉప్పెన సినిమా విడుదల కాకముందే నేచురల్ స్టార్, హీరో నానితో తెలుగు సినిమా ఛాన్స్ రావడం అనేది గొప్ప విషయం అంటున్నారు సినీ విమర్శకులు.  తెలుగు సినీమాకు మరో ఫ్యూచర్ హీరోయిన్ దొరుకుతుంది అని వారు వారంటున్నారు. సితారా ఎంటర్మైంట్ కృతి శెట్టి రెండు సినిమాలు చేయడానికి అంగీకరించినట్టు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News