Freedom at Midnight Web Series Review: ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ వెబ్ సిరీస్ రివ్యూ..
Freedom at Midnight Web Series Review: మనకు 1947 ఆగష్టు 15న అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చిందనే సంగతి తెలిసిందే కదా. కానీ అందుకు మన నేతలు ఎలాంటి త్యాగాలు చేశారు. ఆ సందర్భంగా అనుభవించిన మానసిక సంక్షోభం..ఎలంటి పరిస్థితిలను ఫేస్ చేసారనేది చాలా మంది యువతరానికి తెలియదు. ఈ నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ ‘ఫ్రీడమ్ ఎట్ మిట్ నైట్’. సోనీ లివ్ లో ప్రసారమవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉందా లేదా మన వెబ్ సిరీస్ రివ్యూలో చూద్దాం..
Freedom at Midnight Web Series Review: కరోనా తర్వాత ఓటీటీ ల్లో పలు వెబ్ సిరీస్ లు వచ్చాయి. అందులో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేవి ఈ మధ్యకాలంలో చాలా తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ అంటూ అప్పటి స్వాతంత్య్రం రావడానికి అప్పటి బ్రిటిష్ వాళ్లు.. మన దేశ నేతలో ఎలాంటి ఒప్పందం చేసుకున్నారనే నేపథ్యంలో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’. సోనిలివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనే విషయం మన రివ్యూలో చూద్దాం..
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
మనకు స్వాతంత్య్రం రావడానికి మహాత్మ గాంధీ ఆధ్వర్యంలో మితవాదులు.. తిలక్, సావర్కర్, అల్లూరి, భగత్ సింగ్ నేతృత్వంలో అతివాదులుగా విడిపోయారు. స్వాతంత్య్రం అనేది ఒకడు ఇచ్చే భిక్ష కాదనేది అతివాదుల వాదన. సామరస్య పూర్వకంగా మాట్లాడి స్వాతంత్య్రం సిద్ధించేలా బ్రిటిష్ వారిని ఒప్పించడం అనేది గాంధీ నేతృత్వంలోని మితవాదుల సిద్ధాంతం.. దాన్ని వెబ్ సిరీస్ లో కొంత నొప్పించి కొంత ఒప్పించేలా దర్శకుడు నిఖిల్ అద్వానీ చక్కగా ప్రెజెంట్ చేశాడు. ముఖ్యంగా ఆనాటి కాలం నాటి స్థితిగతులను ఆర్ట్ వర్క్ ను అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. అంతేకాదు ఆయా పాత్రకు తగ్గ నటీనటులను ఎంపిక చేయడంతో పాటు వారి నుంచి నటన రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఆనాటి ఘటనలను దర్శకుడు ఎంతో రీసెర్చ్ చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాదు చరిత్ర గురించి తెలుసుకునే వాళ్లకు ఇది ఎంతో యూజ్ ఫుల్ గా ఉంటుంది. అంతేకాదు ఆనాటి సంఘటనలను మాస్ ప్రేక్షకులు మెచ్చేలా ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దడంలో దర్శకుడి ప్రతిభ కనబడుతోంది. ముఖ్యంగా 1944 -47 మధ్య గాంధీ, జిన్నా, నెహ్రూ, పటేల్ మధ్య జరిగిన సంఘర్షణను తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్వాతంత్య్రం సందర్భంగా చెలరేగిన అల్లర్లు. ఎంతో మంది ప్రజలు చనిపోవడం వంటివి తెరపై చూపించడం మాములు విషయం కాదు. ముఖ్యంగా ఆయా పాత్రలు సజీవంగా మన ముందుకు వచ్చాయా అనే రీతిలో దర్శకత్వ ప్రతిభతో పాటు నటీనటుల నటన ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇచ్చింది. ముఖ్యంగా ఆనాటి సౌండ్ మ్యూజిక్స్ తో పాటు ఆర్ఆర్ ఆకట్టుకునే విధంగా నిర్మాతలు ఈ వెబ్ సిరీస్ గురించి పడ్డ తపన అడుగడున కనబడుతోంది. ఈ సిరీస్ లో ఆనాటి భవనాలు.. వారి క్యాస్ట్యూమ్స్ , ఆర్ట్ వర్క్ గురించే ఎక్కువ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో కాస్ట్యూమ్ డిజైనర్స్ పాత్రను కొట్టిపారేయలేనది.
నటీనటులు విషయానికొస్తే..
ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సిరీస్ లో పండిత్ నెహ్రూ పాత్రలో సిద్ధాంత్ గుప్తా, సర్ధార్ పటేల్ పాత్రలో రాజేంద్ర చాల్వా.. మహాత్మా గాంధీ చిరాగ్ వోహ్రా లూర్డ్ లూయిస్ మౌంట్ బాటెన్ , జిన్నా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు అద్భుతంగా నటించారు. మొత్తంగా ఆనాటి పరిస్థితుల్లో గాంధీ, నెహ్రూలు ఎలాంటి సంఘర్షణ అనుభవించారనేది మనకు తెలియకపోయినా.. తెరపై వాళ్లు అద్భుతంగా నటించి చూపించారు. మొత్తంగా స్వాతంత్య్రం నాటి పరిస్థితులను తెలుసుకోవాలనుకునే వారికీ ఇదో అద్భుతమైన కంటెంట్.. సోనీ లివ్ లో దీన్ని మిస్ కాకుండా చూడండి..
బ్యాటమ్ లైన్.. స్వాతంత్య్రం నాటి గడ్డు పరిస్థితులను కళ్లకు కట్టే ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’..
రేటింగ్: 3/5
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter