Gayatri Bharadwaj to romance with Ravi Teja in Tiger Nageswara Rao Movie: జయాపజయాలను పట్టించుకోకుండా మాస్ మాహారాజా రవితేజ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్‏లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అంతేకాదు మాస్ మాహారాజా కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉగాది పర్వదినాన మాదాపూర్‌లోని నోవాటెల్లో 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ జరగనుంది. శనివారం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్ విడుదల అవనున్న ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు మూవీలో బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ నటిస్తున్నట్లుగా ప్రకటించిన చిత్రయూనిట్.. తాజాగా మరో హీరోయిన్ ఉందంటూ అధికారికంగా ప్రకటించారు. 


ఇండియన్‌ హాట్ మోడల్‌, నటి గాయత్రి భరద్వాజ్‌ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'రవితేజ మాసివ్ హంట్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలోకి గాయత్రి భరద్వాజ్‌కు స్వాగతం చెపుతున్నాం' అని మేకర్స్ ట్వీట్ చేశారు. గాయత్రి భరద్వాజ్‌ మోడల్. ఆమె ఇదివరకు వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్ చేశారు. నుపూర్ సనన్ మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్‌ సోదరి. 


వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో గతంలో ఎప్పుడూ చేయని పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ భారీ రెస్పాన్స్ సంపాదించింది. ఎప్పటిలానే జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర తారాగణం వివరాలు త్వరలో తెలియరానున్నాయి. రవితేజ ప్రస్తుతం ధమాకా, రావణాసుర చిత్రాలు చేస్తున్నాడు. రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా త్వరలోనే విడుదల కానుంది.


Also Read: Gaalivaana Trailer: ఆ లం.. కొడుకు నా కంటికి కనపడితే ఆ దేవుడు కూడా కాపాడలేడు! 'గాలివాన' ట్రైలర్‌ అదుర్స్!!


Also Read: Chiranjeevi Sukumar: సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిరంజీవి- ఫొటోలు షేర్ చేసిన మెగాస్టార్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook