Chiranjeevi Sukumar: సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిరంజీవి- ఫొటోలు షేర్ చేసిన మెగాస్టార్!

Chiranjeevi Sukumar: ప్రముఖ దర్శకుడు సుకుమార్ తో మెగాస్టార్ చిరంజీవి కలిసి ఓ ప్రాజెక్టు చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో పనిచేస్తున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని చిరు ట్వీట్ చేశారు. అయితే అది సినిమా కోసం మాత్రం కాదు!  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 02:59 PM IST
Chiranjeevi Sukumar: సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిరంజీవి- ఫొటోలు షేర్ చేసిన మెగాస్టార్!

Chiranjeevi Sukumar: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'గాడ్ ఫాదర్', 'భోళాశంకర్'తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన ప్రధానపాత్రలో తెరకెక్కించిన 'ఆచార్య' చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఆయన మరో షూటింగ్ లో పాల్గొన్నారు. అది కూడా స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో పనిచేస్తున్నారు. 

అయితే సుకుమార్ దర్శకత్వంలో తాను నటిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సుకుమార్ డైరెక్షన్ ను తానెంతో ఎంజాయ్ చేసినట్లు చిరు తెలిపారు. కానీ, అది సినిమా కోసం కాదు. ఓ ప్రకటన కోసం మాత్రమే! 

ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఇవ్వనున్న యాడ్ లో చిరంజీవి నటించారు. ఆ యాడ్ షూట్ కు ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తాజాగా చిరు కొన్ని ఫొటోలు ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ సందర్భంగా సుకుమార్ పై ప్రశంసలు కురిపించారు.  

దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే.. ఓ ad film కోసం, సుకుమార్ దర్శకత్వం లో షూటింగ్ నేను చాలా enjoy చేశానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ యాడ్ నిర్మించిన సదరు రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు తెలిపారు.  

Also Read: Shruti Hassan Photos: శ్రుతి హాసన్ హాట్ హాట్ అందాలు కుర్రకారు ఫిదా!

Also Read: KCR Biopic: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ బయోపిక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News