Glitch in Radhe Shyam Telugu Trailer: రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిమిమా.. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథతో తెరకెక్కింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. కరోనా వైరస్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన రాధేశ్యామ్ సినిమా.. ఎట్టకేలకు మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్ర యూనిట్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాధేశ్యామ్ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో బుధవారం (మార్చి 2) చిత్ర యూనిట్ కొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది. ముంబైలోని పీవీఆర్ జుహులో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. అయితే తెలుగు ట్రైలర్‌లో పొరపాటు జరగడంతో మేకర్స్ వెంటనే దాన్ని డిలీట్ చేశారు. కొద్దిసమయానికి మళ్లీ అప్‌లోడ్ చేశారు. 'రాధేశ్యామ్ తెలుగు ట్రైలర్‌లో పొరపాటు ఏర్పడినందుకు మేము క్షమాపణలు కోరుతున్నాము. కొత్త ట్రైలర్‌ను అప్‌లోడ్ చేసాము. ఇప్పుడే చుడండి' అంటూ యూవీ క్రియేషన్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 


రాధేశ్యామ్ రెండు ట్రైలర్స్ చుసిన వారికి మిస్టేక్ ఏంటి? అని స్పష్టంగా అర్ధం అవుతుంది. చూడని వారు మాత్రం అదేంటని ఆలోచిస్తున్నారు. విషయం ఏంటంటే.. రాధేశ్యామ్ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఇదే పాత్రలో సత్యరాజ్‌ నటించారు. తెలుగు ట్రైలర్‌లో కృష్ణంరాజు స్థానంలో సత్యరాజ్‌ని చూపించారు. ఇది గమనించిన ఫాన్స్. వరుస ట్వీట్లు చేయడంతో మేకర్స్ అప్రమత్తమయ్యారు. వెంటనే ట్రైలర్‌ను డిలీట్ చేసి.. మళ్లీ  కొత్త ట్రైలర్‌ను అప్‌లోడ్ చేశారు.



'మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం.. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి' అని ప్రభాస్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభం అవుతుంది. 'ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు' అని పూజా హెగ్డే చెప్పిన డైలాగ్, 'ఇంకోసారి చెయ్యి చూడు' అని జగపతి బాబు పలికిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచింది. రాజులు, యువ‌రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ లాంటి పెద్దపెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్ర‌భాస్ న‌టించారు.


Also Read: Gold Rate Today 3 March 2022: పసిడి ప్రియులకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు!!


Also Read: Deepak Chahar: ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నైకు ఎదురుదెబ్బ.. సగం మ్యాచ్​లకు దీపక్ చాహర్ దూరం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook